Begin typing your search above and press return to search.

RRR పోరాటంలోనూ క‌థ‌ను చెబుతుంది!

By:  Tupaki Desk   |   11 July 2021 3:30 PM GMT
RRR పోరాటంలోనూ క‌థ‌ను చెబుతుంది!
X
ఫైట్స్ లేదా యాక్ష‌న్ సీక్వెన్సుల‌ను తెర‌కెక్కించే విధానం ఒక‌ప్ప‌టి తో పోలిస్తే ఇప్పుడు చాలా మారింది. తెలుగు సినిమా ఫైట్స్ రూపురేఖ‌లు పూర్తిగా మారాయి. యాక్ష‌న్ సీక్వెన్సులు ఎంతో అర్థ‌వంతంగా క‌నిపిస్తున్నాయి. లాజిక్ పూర్తిగా మిస్స‌వ్వ‌డం లేదు. ఇక‌పోతే ఎస్‌.ఎస్.రాజ‌మౌళి ఒక యాక్ష‌న్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్నారు అంటే అందులో భారీ ఎమోష‌న్ ని ర‌గిలించ‌డంలో మహా దిట్ట‌. ఇంత‌కుముందు ఛ‌త్ర‌ప‌తి .. విక్ర‌మార్కుడులో అలాంటి ఎమోష‌న్స్ చూశాం. ర‌గ్భీ నేప‌థ్యంలోని సై సినిమాలోనూ ఎక్క‌డా త‌గ్గ‌లేదు.

బాహుబ‌లి ప‌తాక స‌న్నివేశాల్లో అలాంటి ఎమోష‌న్ ర‌గిలించ‌డంలో అత‌డు త‌న ప‌నిత‌నాన్ని చూపించారు. ఏ చిన్న ఫైట్ వ‌చ్చినా దానికి అనుబంధంగా ఎమోష‌న్ అంతే ప్ర‌భావ‌వంతంగా డిజైన్ చేయ‌డంలో జ‌క్క‌న్న సూప‌ర్భ్ అని నిరూపించారు.

ఇప్పుడు RRR విష‌యంలోనూ ఆయ‌న ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ట‌. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ చివరి దశలో ఉంది. సిటీలో షూటింగ్ ముగించిన తర్వాత బృందం విదేశీ లొకేష‌న్స్ కి వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో ప్ర‌తి పోరాట స‌న్నివేశం సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటాయ‌ని ఇదివ‌ర‌కూ విజ‌యేంద్ర ప్రసాద్ వెల్ల‌డించారు. తాజాగా డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా యాక్ష‌న్ లోనే ఎమోష‌న్ గురించి మాట్లాడారు.

``ప్ర‌తి పోరాట సన్నివేశం ఏదో గొడవప‌డ‌డం లాంటిది కాదు. ఆర్‌.ఆర్‌.ఆర్ లో పోరాట సన్నివేశం చాలా ఉద్వేగభరితమైనది.. ఇది చ‌క్క‌ని కథను చెబుతుంది. కన్నీళ్లు పెట్టుకునేంత‌గా ఎమోష‌న్ ని ర‌గిలిస్తుంది. ఆర్‌.ఆర్‌.ఆర్ పోరాట సన్నివేశం గొప్పతనం అది`` అని రచయిత సాయి మాధ‌వ్ చెప్పారు. అతను RRR లో చిన్న భాగాన్ని చూశానని ఇది అసాధారణంగా ఉంద‌ని తెలిపారు. జ‌క్క‌న్న ఆర్.ఆర్.ఆర్ కోసం ది బెస్ట్ గా ప్ర‌య‌త్నించారు... అని తెలిపారు. బాహుబ‌లి చిత్రానికి సాయిమాధ‌వ్ డైలాగులు అందించాల్సింది.. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగార‌ని ప్ర‌చార‌మైన సంగ‌తి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కోసం ఉద్ధండులిద్ద‌రూ క‌లిసారు.