Begin typing your search above and press return to search.
డ్రగ్స్ తో నాకెలాంటి సంబంధం లేదు!- దియా మీర్జా
By: Tupaki Desk | 22 Sept 2020 11:02 PM ISTబాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ షాట్స్ పేర్లు తెరపైకి రావడం కలకలం రేపుతోంది. నార్కోటిక్స్ బ్యూరో విచారణలో డ్రగ్ పెడ్లర్స్ సహా హీరోలు అలాగే కథానాయికల మేనేజర్లు నేరుగా పేర్లను రివీల్ చేయడంతో ఇప్పటికే పలువురు అగ్ర కథానాయికల పేర్లు జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. ఇటు లోకల్ మీడియాల్లోనూ పలువురు కథానాయికల పేర్లతో కథనాలు హీటెక్కిస్తున్నాయి.
ఇక ఈ కేసులో జయా సాహాతో డ్రగ్స్ కు సంబంధించి నమ్రత చాట్ చేశారని వచ్చిన వార్తల్ని పర్సనల్ టీమ్ ఖండించింది. తమకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అసత్య ప్రచారం చేసి బురద జల్లుతున్నారని నమ్రత టీమ్ ఖండించిన సంగతి తెలిసిందే.
ఇక ఇదే కేసులో మరో నటి కం హైదరాబాదీ అమ్మాయి దియా మీర్జా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019లో దియాకు పెడ్లర్లు డ్రగ్స్ సరఫరా చేశారని ఎన్.సి.బి కి రివీల్ చేసినట్టు జాతీయ మీడియా కథనాలు వినిపించాయి. దియా మీర్జాకు త్వరలోనే సమన్లు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని జాతీయ.. ప్రాంతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అయితే వీటిని ఖండిస్తూ దియా తాజాగా స్పందించారు. డ్రగ్స్ దుర్వినియోగం వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని ట్విట్టర్ వేదికగా దియా ఖండించారు. తనపై వస్తున్న ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని దియా తెలిపారు.