Begin typing your search above and press return to search.

మరోసారి మనోడికి అవార్డు గ్యారంటీ

By:  Tupaki Desk   |   19 April 2017 4:30 AM GMT
మరోసారి మనోడికి అవార్డు గ్యారంటీ
X
ఇప్పుడు హిందీ సినిమా అంతా రియాలిటీ ఉన్న కథలు.. హిస్టారికల్ స్టోరీస్.. బయో పిక్స్ పైనా మక్కువ చూపుతున్నారు. కిందటి ఏడు దంగల్ సినిమా ఏ రేంజు కలెక్షన్స్ చేసిందో మొత్తం భారత చిత్ర పరిశ్రమకు తెలుసు. ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ మొత్తం నోరెళ్ళబెట్టి చూస్తున్న సినిమా ఏంటంటే.. రణబీర్ కపూర్ నటిస్తున్న రాజ్ హిరాణి తదుపరి సినిమా.

ఈ బయో పిక్ సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్.. సంజయ్ పాత్ర పోషిస్తున్నారు. అతని భార్య మాన్యతగా దియా మీర్జా నటిస్తోంది. దియా మీర్జా హిందీ లో టాప్ హీరోయిన్ కాకపోయనా అప్పుడుఅప్పుడు చేసిన కొన్ని సినిమాలతో మంచి పేరు చెచ్చుకుంది. రణ్‌ బీర్‌ తో తొలిసారిగా నటిస్తున్న దియా మీర్జా మాట్లాడుతూ అతను నటనకు నేను దాసోహం అని సెలవిచ్చింది. అతను ఒక గొప్ప నటుడు అని.. ఈ సినిమా తరువాత అతని నటనకు ఇప్పటి కన్నా పది రెట్లు పేరు తెచ్చిపెడుతుంది అని వక్కాణించి మరి చెప్పుతుంది. అవార్డులు కూడా గ్యారంటీగా వస్తాయట.

విషయం ఏంటంటే.. బర్ఫీ అండ్ రాక్ స్టార్ వంటి సినిమాల్లో కూడా రణబీర్ కపూర్ నటన అద్భుతంగానే ఉంది. కాని ఆ సినిమాలు కమర్షియల్ గా మాత్రం ఆడట్లేదు. రణబీర్ కు అవార్డులు వస్తున్నాయి కాని.. ప్రొడ్యూసర్లకు కాసులు కురవట్లేదు. ఈసారి రాజు హిరాణి అయినా ఆ లోటు తీరుస్తాడని ఆశిద్దాం. ఈయన తీసిన 3 ఇడియట్స్.. పీకె సినిమాలే అందుకు నిదర్శనం. ఆ లక్ రణబీర్ కూ వస్తే బాగుండు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/