Begin typing your search above and press return to search.

బిజినెస్ మేన్ తో దియా మీర్జా పెళ్లి వేడుక దృశ్యాలు

By:  Tupaki Desk   |   16 Feb 2021 9:17 AM IST
బిజినెస్ మేన్ తో దియా మీర్జా పెళ్లి వేడుక దృశ్యాలు
X
హైద‌రాబాదీ అమ్మాయి.. అందాల క‌థానాయిక దియా మీర్జా ముంబై బిజినెస్ మేన్ వైభవ్ రేఖీని పెళ్లాడారు. సోమ‌వారం సాయంత్రం ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. దియా.. వైభ‌వ్ ఇరువురికి ఇది రెండో వివాహం.

పెళ్లి వేడుక నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఫోటోల్ని ప‌రిశీలిస్తే .. ఇది హిందూ సాంప్ర‌దాయంలో సాగిన పెళ్లి అని అర్థ‌మ‌వుతోంది. పెళ్లిలో సాంప్రదాయ వివాహ ఆభరణాలతో ఎరుపు రంగు జ‌రీ చీరలో దియా చాలా అందంగా క‌నిపించారు. వరుడు వైభవ్ తెలుపు కుర్తా చుడిదార్... బంగారు దుప్పట్టాని ధ‌రించారు. ఓ వీడియోలో వధువు వివాహ మండపం వైపు నడుస్తుండగా.. మరొక ఫోటోలు పెళ్లి కి సిద్ధ‌మైన‌ వధూవరులను చూడొచ్చు. పెళ్లిలో ఫోటోగ్రాఫ‌ర్ల‌కు స్వీట్లు పంచారు దియా.

ఈ వివాహం అత్యంత‌ సన్నిహితులు దంపతుల బంధువుల స‌మ‌క్షంలో సాగింది. పరిశ్రమ సహోద్యోగులైన అదితీరావు హైదారి.. జాకీ భగ్నాని,.. గౌతమ్ గుప్తా వివాహంలో అతిథులుగా క‌నిపించారు.

పెళ్లి వేడుక‌ల్లో భాగంగా మెహెంది వేడుక .. పెళ్లి కూతురి ఫోటోలు ఇదివ‌ర‌కూ సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇది దియాకు రెండవ వివాహం. 2014 నుండి 2019 వరకు మొద‌టి భ‌ర్త‌ సాహిల్ సంఘాతో సంసార జీవ‌నం అనంత‌రం విడాకులు తీసుకున్నారు. 2019 ఆగస్టులో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ జంట విడిపోతున్నామ‌ని ప్రకటించారు.