Begin typing your search above and press return to search.
షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ చరణ్ ట్వీట్...!
By: Tupaki Desk | 16 May 2020 3:20 PM ISTకరోనా లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో హీరోలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే హీరోలు దొరికిన టైమ్ ను పూర్తిగా ఫ్యామిలీకి ఇచ్చేస్తున్నారు. ప్రతీ స్టార్ హీరో కూడా ఇప్పుడు ఇదే పని చేస్తున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీతో మిస్ అయిన సమయాన్ని అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఫ్యామిలీతో ఎంతగా సమయం కేటాయించడానికి ఇష్టపడతాడో మనందరికీ తెలుసు. షూటింగ్ కి ఏ మాత్రం గ్యాప్ వచ్చినా తన కుటుంబంతోనే గడుపుతుంటాడు. తన భార్య ఉపాసనతో కలిసి ఔటింగ్ లకు వెళ్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కరోనా మహమ్మారి పుణ్యమా అని వారితో ఇంకా ఎక్కువ సమయం గడిపే అవకాశం చరణ్ కి లభించింది. దీంతో లాక్ డౌన్ సమయాన్ని ఫుల్ గా వాడేసుకుంటున్నాడు. తన భార్యకు సపర్యలు చేస్తున్నాడు.. అమ్మ నాన్నమ్మ దగ్గర వెన్న చిలకడం నేర్చుకుంటున్నాడు.. ఇంటి పనుల్లో వారికి సహాయం చేస్తూ రియల్ మ్యాన్ అనిపించుకుంటున్నాడు.
అంతే కాకుండా ఎప్పటికప్పుడు కరోనా నివారణకు అవగాహన కల్పించే పోస్టులను పెడుతూ సమాజంలో తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ మెగా కాంపౌండ్ లోని కిడ్స్ తో ఆడుకుంటున్నాడు. అయితే ఇప్పటికే సినిమా షూటింగులు లేక రెండు నెలలు అవుతోంది. దీంతో రామ్ చరణ్ షూటింగ్ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నాడు. తాజాగా తన 'ధృవ' సినిమా సెట్స్ లో దిగిన ఫోటోలను ట్వీట్ చేస్తూ.. ''ధృవ సినిమా సెట్స్ లోని త్రో బ్యాక్ పిక్స్ ఇవి. సెట్స్ కి తిరిగి వెళ్ళడానికి ఇక వేచి ఉండలేను. అయితే అప్పటి వరకు ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలి'' అంటూ చరణ్ పోస్ట్ చేశాడు. దీని బట్టి చూస్తే చరణ్ షూటింగ్ కోసం ఎంతో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని అర్థం అవుతోంది.
ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'కొమరం భీమ్' పాత్రలో కనిపిస్తుండగా చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన వీడియోలో చరణ్ సాలిడ్ బాడీతో సాలిడ్ గా కనిపించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ 'అల్లూరి సీతారామరాజు'గా చూపించిన రౌద్రం ఈ ఒక్క చిన్న వీడియో చూస్తేనే తెలిసిపోతుంది. గ్రాండ్ ఎలివేషన్స్ షాట్స్ అండ్ భారీ విజువల్స్ అలాగే చరణ్ యాక్షన్ స్టంట్స్ అదిరిపోయాయి. ఫ్యాన్స్ ఆసక్తిని ఇంకా డబుల్ రెట్టింపు చేస్తూ అభిమానులు పెట్టుకున్న భారీ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా చరణ్ సిక్స్ ఫ్యాక్ తో అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. ఈ సినిమా తర్వాత తన తండ్రి చిరంజీవి తో కలిసి 'ఆచార్య' సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాని కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.