Begin typing your search above and press return to search.

ధృవ.. అక్కడ మామూలు రైజ్ కాదు

By:  Tupaki Desk   |   12 Dec 2016 6:19 AM GMT
ధృవ.. అక్కడ మామూలు రైజ్ కాదు
X
తొలి రోజు టాక్ బాగున్నా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ‘ధృవ’ కథ ఎలా ముగుస్తుందో అని అంతా కంగారు పడిపోయారు. ఈ సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టేయడం.. చాలా ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకోవడంతో అల్లు అరవింద్ కు ఎదురు దెబ్బ తగులుతుందేమో అని కూడా చర్చ నడిచింది. కానీ ‘ధృవ’ కలెక్షన్లు స్టడీగా ఉండటం.. ముఖ్యంగా ఆదివారం.. ముందు రోజు కన్నా కలెక్షన్లు పెరగడంతో ఈ సినిమా లాభాలు అందించడం ఖాయమని తేలిపోయింది. ఫస్ట్ వీకెండ్లో ఏపీ అండ్ తెలంగాణ లో 21 కోట్ల షేర్ మార్కును టచ్ చేస్తుండటంతో ‘ధృవ’కు తిరుగులేదని అర్థమైపోయింది.

ఐతే మిగతా చోట్ల ‘ధృవ’ కలెక్షన్లన్నీ ఒకెత్తయితే.. యుఎస్ వసూళ్లు మరో ఎత్తు. చరణ్ డిజాస్టర్ మూవీ ‘బ్రూస్ లీ’ కంటే కూడా ‘ధృవ’ ప్రిమియర్ షోలకు తక్కువ వసూళ్లు రావడంతో కంగారు పడిపోయారు కానీ.. ఆ తర్వాత ఈ సినిమాకు అనూహ్యమైన వసూళ్లే వచ్చాయి. తొలి రోజు 2.44 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘ధృవ’.. శనివారం అనూహ్యంగా మూడున్నర లక్షల డాలర్ల దాకా కొల్లగొట్టి అప్పుడే ఓవరాల్ కలెక్షన్లలో 8 లక్షల డాలర్ల మార్కును దాటేసింది. దీన్ని బట్టి ఆదివారమే ‘ధృవ’ మిలియన్ క్లబ్బులోకి అడుగపెట్టేసి ఉన్నా ఆశ్చర్యం లేదు. యుఎస్ లో శనివారంతో పోలిస్తే ఆదివారం కలెక్షన్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆదివారం కాకపోయినా సోమవారం మిలియన్ మార్కు గ్యారెంటీ. మొత్తానికి రామ్ చరణ్ కల నెరవేరినట్లే. ఐతే యుఎస్ బయ్యర్ సినిమా మీద పెట్టుబడి భారీగానే పెట్టాడు. 1.5 మిలియన్ మార్కును అందుకుంటేనే లాభాలు దక్కుతాయి.

Dhruva AP and Telangana DISTRIBUTOR SHARES

Nizam
Day 1 - 3.26
2 - 1.94
3 - 2.01
Total 7.21 Cr

Ceded
Day 1 - 1.81
2 + Hires - 0.76 + 0.20 = 0.96
3 - 0.90
Total 3.67 Cr

Vizag
Day 1 - 1.37
2 - 0.70
3 - 0.75
Total 2.82 Cr

East
Day 1 - 0.85
2 - 0.35
3 - 0.38
Total 1.58 Cr

West
Day 1 - 0.90
2 - 0.29
3 - 0.36
Total 1.55 Cr

Krishna
Day 1 - 0.67
2 - 0.36
3 - 0.51
Total 1.54 Cr

Guntur
Day 1 - 1.08
2 - 0.33
3 - 0.44
Total 1.85 Cr

Nellore
Day 1 - 0.41
2 - 0.15
3 - 0.17
Total 0.73 Cr

AP/Nizam
Day 1 - 10.35 Cr
Day 2 - 5.08 Cr
Day 3 - 5.52 Cr

Total 3 Days AP/Nizam 20.95 Cr SHARE