Begin typing your search above and press return to search.

టికెట్ కౌంటర్: ధృవ.. దూసుకుపోతున్నాడు

By:  Tupaki Desk   |   12 Dec 2016 10:46 AM GMT
టికెట్ కౌంటర్: ధృవ.. దూసుకుపోతున్నాడు
X
టాలీవుడ్ బాక్సాఫీసులు కళకళలాడు చాలాకాలం అయిపోయింది. డీమానిటైజేషన్ దెబ్బకి టికెట్ కౌంటర్లన్నీ వెలవెలబోయాయి. జనాలు సినిమాల కోసం వందనోట్లు మార్చేందుకు వెనకాడాల్సిన పరిస్థితి ఏర్పడగా.. ఇలాంటి సిట్యుయేషన్ లో తొలి భారీ బడ్జెట్ చిత్రంగా రిలీజ్ అయిన రామ్ చరణ్ ధృవ.. తిరిగి ఇండస్ట్రీకి కళ తీసుకొచ్చింది.

1. ధృవ: మెగా పవర్ స్టార్ నటించిన ధృవ తొలి రోజు వసూళ్లు భారీగానే ఉన్నా.. చెర్రీ రేంజ్ లో లేకపోవడం.. నిర్మాతలనే కాదు.. ఏకంగా ఇండస్ట్రీనే వణికించేసింది. అయితే.. మౌత్ టాక్ బాగుండడంతో రెండో రోజుకే విపరీతంగా పుంజుకున్నాడు ధృవ. మొదటి రోజు మించి శనివారం.. అంతకు మించి ఆదివారం వసూళ్లు రావడంతో.. ఈ వారం ధృవ మోతతో బాక్సాఫీస్ దద్దరిల్లి పోయింది. అయితే.. వీక్ డేస్ లోనూ నెక్ట్స్ వీకెండ్ లోనూ భారీగా ఉంటేనే.. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తగినట్లుగా కలెక్షన్స్ వస్తాయి. తొలి వీకెండ్లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి 21 కోట్లు వసూలు చేసింది.

2. ఎక్కడికి పోతావు చిన్నవాడా: నిఖిల్ నటించిన ఈ థ్రిల్లర్ నాలుగోవారంలో కూడా మంచి వసూళ్లు వస్తుండడం విశేషంగానే చెప్పాలి. ఇప్పటికే 15 కోట్ల మేర వసూళ్లు సాధించిన ఈ మూవీ.. బడ్జెట్ ప్రకారం చూస్కుంటే ఈ ఏడాది అతి పెద్ద హిట్స్ లో స్థానం సంపాదించేసినట్లే.

3. మన్యం పులి: మోహన్ లాల్ నటించిన మన్యం పులికి.. ఏ సెంటర్స్ లో అంతగా ఆదరణ లేకపోయినా.. బీ సీ సెంటర్లలో మాత్రం వసూళ్లు బాగున్నాయి. అన్ని వర్గాల నుంచి మంచి టాక్ రావడంతో.. కలెక్షన్స్ పెరిగే ఛాన్సులు ఉన్నాయంటున్నారు ట్రేడ్ జనాలు.

4. బేఫికర్: లిప్ లాక్ ల సినిమాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి ఏ సెంటర్లలో.. మల్టీప్లెక్స్ లలో మంచి ఆదరణే దక్కింది. అయితే.. మౌత్ టాక్ ఘోరంగా ఉండడంతో.. వాటిని నిలబెట్టుకోవడం అసాధ్యం అనే చెప్పాలి.

5. బేతాళుడు: విజయ్ యాంటోనీ నటించిన ఈ మూవీ మరో బిచ్చగాడి రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఆశించినా.. ఆ స్థాయిని కాదు కదా.. కనీసం హిట్ అనిపించుకోవడంలో కూడా బేతాళుడు ఫెయిల్ అయ్యాడు. అయితే.. శాటిలైట్ రూపంలో భారీ మొత్తం రావడంతో నిర్మాతలకు నష్టాలు రాలేదంతే.