Begin typing your search above and press return to search.

ధృవ.. అమ్మాయిలు మోత మోగిస్తున్నారు

By:  Tupaki Desk   |   15 Nov 2016 5:28 AM GMT
ధృవ.. అమ్మాయిలు మోత మోగిస్తున్నారు
X
రామ్ చరణ్ మూవీ ధృవ షూటింగ్ మొత్తం పూర్తయిపోయిన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముందే మొదలుపెట్టేయడంతో.. ఇప్పుడు కేవలం 30శాతం వర్క్ మాత్రమే పెండింగ్. తాజా కరెన్సీ సంక్షోభం పరిస్థితుల్లో డిసెంబర్ 2 రిలీజ్ పై కాసిన్ని అనుమానాలు ఉన్నాయి. అలాగని పబ్లిసిటీ యాంగిల్ ని మాత్రం వదిలిపెట్టడం లేదు ధృవ.

ఇప్పుడు డబ్ స్మాష్ ల రూపంలో కూడా రచ్చ మొదలైపోయింది. ధృవడబ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో.. అమ్మాయిలు డబ్ స్మాష్ చేసేస్తున్నారు. ముఖ్యంగా 'చూశా చూశా' పాటకైతే రియాక్షన్ విపరీతంగా ఉంది. ధృవలోని అన్ని పాటలను పాడేసి వీడియోలు తీసేసి నెట్ లో పెట్టేస్తున్నారు. ఇలా డబ్ స్మాష్ లు చేస్తున్నవారంతా.. టీనేజ్ గాళ్స్.. చిన్న పిల్లలే కావడం విశేషం.

యూత్ తో పాటు చిన్నారుల్లోనూ మెగా పవర్ స్టార్ కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో.. ఈ ధృవ డబ్స్ తెలియజేస్తోంది. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇంకా ధృవ యూనిట్ నుంచి క్లారిటీ రాకపోవడం.. విడుదలపై సందేహాలను కలిగిస్తోందంటున్నారు టాలీవుడ్ జనాలు. వరంగల్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని చెప్పినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా వేడుకలు చేసుకోవడం కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/