Begin typing your search above and press return to search.

ఆ రెండు ట్రైల‌ర్లూ జ‌న‌తా త‌రువాతే!

By:  Tupaki Desk   |   12 Oct 2016 9:05 AM GMT
ఆ రెండు ట్రైల‌ర్లూ జ‌న‌తా త‌రువాతే!
X
ఈ ద‌స‌రా పండుగ‌కు రెండు పెద్ద చిత్రాల ట్రైల‌ర్లు అభిమానుల ముందుకు వ‌చ్చాయి. నంద‌మూరి బాల‌కృష్ణ వంద చిత్రం "గౌతమీపుత్ర శాతకర్ణి"పై మొదట్నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే, తమిళంలో సూపర్ హిట్ అయిన "తన్నీ ఒరువన్" రీమేక్ గా వ‌స్తున్న రామ్ చ‌ర‌ణ్ చిత్రం "ధృవ‌"పై కూడా మెగా ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. ఈసారి రామ్ చ‌ర‌ణ్ హిట్ కొట్ట‌డం ప‌క్కా అనే న‌మ్మ‌కంతో ఉన్నారు. దీంతో ఈ రెండు ట్రైల‌ర్లూ ద‌స‌రా పండుగ రోజున విడుల‌య్యాయి! ఈ రెండు ట్రైల‌ర్లూ యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. ట్రెండింగ్ జాబితాలోకి టాప్ ప్లేసెస్ కి వ‌చ్చాయి. చారిత్రక‌ చిత్రం "గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి" విడుద‌లైన 20 గంట‌ల్లో మిలియ‌న్ వ్యూస్ మార్క్ దాటింది. దానికంటే కాస్త త్వ‌ర‌గా, అంటే 17 గంట‌ల్లోనే "ధృవ‌" కూడా ఒక మిలియ‌న్ లైన్ క్రాస్ చేశాడు. అయితే, తార‌క్ హీరోగా వ‌చ్చిన "జ‌న‌తా గ్యారేజ్‌" ట్రైల‌ర్ సృష్టించిన రికార్డు మాత్రం ఇంకా అలానే ఉంది. ఈ రెండు చిత్రాల‌పై భారీ అంచ‌నాలూ క్రేజ్ ఉన్నా... అత్యంత వేగంగా 1 మిలియ‌న్ వ్యూస్ దాటేసిన రికార్డు ఇప్ప‌టికే జ‌న‌తా గ్యారేజ్ ఖాతాలోనే ఉంది.

జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ జూలై 6న విడుద‌లైంది. కేవ‌లం ఆరు గంట‌ల్లోనే యూట్యూబ్ లో 1 మిలియ‌న్ వ్యూస్ మార్క్ దాటేసింది. ఎన్టీఆర్‌-కొర‌టాల శివ కాంబినేష‌న్ పై మొద‌ట్నుంచీ భారీ అంచ‌నాలు ఉండ‌టంతో ఈ టీజ‌ర్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తే వ‌చ్చారు. అయితే, బాల‌య్య‌, రామ్ చ‌ర‌ణ్ చిత్రాలు కూడా క్రేజీ ప్రాజెక్టులే. బాల‌కృష్ణ‌ది వంద‌వ చిత్రం. పైగా చారిత్ర‌క నేప‌థ్యం. రామ్ చ‌ర‌ణ్ - సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ పై చాలా అంచ‌నాలు ఉన్నాయి. అయితే, ఈ రెండూ జ‌న‌తా గ్యారేజ్ ట్రైల‌ర్ కంటే ఒక మిలియ‌న్ వ్యూస్ దాట‌డంలో కొన్ని గంట‌లు వెన‌కబ‌డ్డాయి. దీనికి కార‌ణం... ద‌స‌రా పండుగ హ‌డావుడి అని చెప్పొచ్చు! లేదంటే, ఇవి కూడా జ‌న‌తా రికార్డును దాటేసే స్థాయి ఉన్న టీజర్లే.

ప్ర‌జ‌లంతా ద‌స‌రా పండుగ హ‌డావుడితో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులూ హ‌డావుడి చేశారు. తెలంగాణ‌లో కొత్త జిల్లాలు, ఆంధ్రాలో ముఖ్య‌మంత్రి కొత్త కార్యాల‌యం ఓపెనింగ్‌, ఇంకో ప‌క్క పండుగ సంబ‌రాలు.. దీంతో తెలుగు ప్ర‌జ‌లు ద‌స‌రా పండుగ నాడు చాలా హ‌డావుడిగా ఉన్నారు. కాబ‌ట్టి, ఈ రెండు ట్రైల‌ర్ల‌ను కాస్త ఆరామ్ గా చూశారంతే! లేదంటే, ఈ రెండూ విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే జ‌న‌తా రికార్డ్ వ్యూస్ ను దాటేసేవి, లేదంటే ఆ రికార్డుకు స‌మీపంలోనే వ్యూస్ కౌంట్ ఉండేవనే అంటున్నారు! మొత్తానికి ఈ రెండు టీజ‌ర్లూ ఇప్పుడు దుమ్ము రేపుతున్నాయి. బాల‌య్య చారిత్ర చిత్రం భారీ స్థాయిలో ఉండ‌బోతోంద‌న్న అంచ‌నాలు మ‌రింత పెంచేలా చేసిందీ ట్రైల‌ర్‌. అలానే, స్టైలిష్ పోలీస్ గా రామ్ చ‌ర‌ణ్ కూడా ఈసారి దుమ్ము దులిపేయ‌డం ఖాయం అనే రేంజిలో ట్రైల‌ర్ క‌ట్ చేశారు. గౌత‌మీ పుత్ర సంక్రాంతికి సిద్ధ‌మౌతుంటే, ధృవ ఒక నెల ముందుగానే సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మౌతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/