Begin typing your search above and press return to search.

చియాన్ వార‌సుడి ఆవేద‌న చూశారా!

By:  Tupaki Desk   |   25 Dec 2019 3:09 PM GMT
చియాన్ వార‌సుడి ఆవేద‌న చూశారా!
X
చియాన్ విక్ర‌మ్ న‌ట‌వార‌సుడు ధ్రువ్ న‌టించిన `ఆదిత్య వ‌ర్మ` ఎన్నో చిక్కుల్ని ఎదుర్కొని ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సెన్సార్ గ‌డ‌ప‌పై బోలెడ‌న్ని క‌ట్స్ ప‌డ్డాయి. య‌థావిధిగా మాతృక `అర్జున్ రెడ్డి` త‌ర‌హాలోనే కొన్ని విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. ఆ క్ర‌మంలోనే సెన్సార్ గ‌డ‌పపై చిక్కుల్ని ఎదుర్కొంది. త‌మిళ‌ సెన్సార్ బోర్డ్ ఈ మూవీ నుంచి కొన్ని బూతు స‌న్నివేశాలకు.. డైలాగ్స్ ని క‌ట్స్ ప‌డ్డాయ‌ట‌.

సినిమా నుంచి తొల‌గించిన వాట‌న్నిటినీ గుది గుచ్చి త‌న ఫ్యాన్స్ కోసం ఓ వీడియో రూపంలో రిలీజ్ చేశాడు ధ్రువ్. అయితే ఇందులో కొన్ని బూతుల్ని మ్యూట్ చేసి స‌న్నివేశం వ‌ర‌కూ వ‌దిలేయ‌గా.. కొన్ని సీన్ల‌ను మాత్రం సెన్సార్ బృందం క‌ట్ చేసార‌ట‌. అందుకే ఆ డైలాగుల్ని.. సీన్ల‌ను ఎప్ప‌టికీ చూడ‌లేరు అంటూ ధ్రువ్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఇక మ్యూట్ చేసిన సీన్ల‌లో బానిట సంధుతో పెద‌వి ముద్దుల ట్రీట్ క‌నిపిస్తోంది. అలాగే ర‌గ్గ్ డ్ గా ర‌ఫ్ గా మాసీగా కొన్ని డైలాగులు వినిపించాయి. ఇక ఈ చిత్రానికి సందీప్ వంగా శిష్యుడు గిరీశ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అయితే తెర‌పై వాటిని చూసే భాగ్యం త‌మ అభిమానుల‌కు ఎక్క‌డ మిస్స‌వుతుందోన‌ని భావించిన ధ్రువ్ ఇలా వీడియో రూపంలో ముందే చూపించేయ‌డం విశేషం. ఇన్ స్టాలో అత‌డు పోస్ట్ చేసిన ఈ వీడియో ఫ్యాన్స్ లో వైర‌ల్ అవుతోంది. న‌వంబ‌ర్ లో ఆదిత్య వ‌ర్మ చిత్రం రిలీజైన సంగ‌తి తెలిసిందే.