Begin typing your search above and press return to search.

పామునే ఇలా ముద్దాడితే.. హీరోయిన్ ని?

By:  Tupaki Desk   |   22 Oct 2019 7:53 AM GMT
పామునే ఇలా ముద్దాడితే.. హీరోయిన్ ని?
X
పాముల్ని.. కీట‌కాల్ని ముద్దాడ‌డం అంటే ఆషామాషీనా? ప్ర‌త్యేకించి పాము జాతిని.. జంతు జాలాన్ని అమితంగా ఇష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వం ఉండాలి. అది లేనిదే వాటిని చూస్తేనే కంగారు పుడుతుంది. ముఖ్యంగా పాములు బ‌ల్లులు వంటి వెన్నుపాము లేని జాతి అంటే మ‌నిషి జాతి భ‌య‌ప‌డుతుంది. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండానే ఏదో హీరోయిన్ ని ముద్దాడేసినంత ఈజీగా ఆ కొండ చిలువ‌ను స‌ద‌రు కుర్ర హీరో ఎలా ముద్దాడేస్తున్నాడో చూశారా?

ఆర‌డుగులు పైగానే ఉంది ఆ కొండ చిలువ (పైతాన్). ఒళ్లంతా చుట్టేస్తోంది. అయినా భ‌య‌ప‌డ‌కుండా దానిని పొదివి ప‌ట్టుకున్నాడు. ప్రేమ‌గా లాలిస్తున్నాడు. నెక్‌ పై నుంచి భుజం మీదుగా చుట్టేసిన ఆ పాము మెడ పై చెయ్యి వేసి ప‌ట్టుకున్నాడు. అటుపై దాని త‌ల‌పై గోముగా ముద్దాడేస్తున్నాడు. అది క‌రుస్తుంద‌ని కానీ... మింగేస్తుంద‌ని కానీ కించిత్ అయినా భ‌యం ఆ ముఖంలో క‌నిపించ‌డం లేదు. ఇంత‌కీ ఎవ‌రీ డేరింగ్ హీరో? అంటారా?..

చియాన్ విక్ర‌మ్ వార‌సుడు ధృవ్. అర్జున్ రెడ్డి రీమేక్ `ఆదిత్య వ‌ర్మ` చిత్రంతో కోలీవుడ్ కి ప‌రిచ‌యం అవుతున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తయింది. త్వ‌ర‌లోనే రిలీజ్ కి రాబోతోంది. త‌న‌యుడి ఆరంగేట్రంపై విక్ర‌మ్ ప్ర‌త్యేకంగా దృష్టి సారించడంతో ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ర‌క‌ర‌కాల డైల‌మాల న‌డుమ ధృవ్ ఎంట్రీ ఎలా జ‌ర‌గ‌నుందో చూడాల‌న్న కుతూహాలం అభిమానుల్లో ఉంది. మ‌రి అంద‌గాడైన ఈ న‌వ‌త‌రం హీరో ఫేట్ ఎలా ఉంది? అన్న‌ది ఆగి చూడాలి. అన్న‌ట్టు ఇక్క‌డ పైతాన్ కి ఒక ముద్దు మాత్ర‌మే ఇచ్చాడు. ఆదిత్య వ‌ర్మ చిత్రంలో హీరోయిన్ కి 30 పైగా ముద్దులిచ్చాడు. అదీ సంగ‌తి.