Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి తరువాత బ్రేక్ తప్పదు

By:  Tupaki Desk   |   24 Jan 2018 4:54 PM GMT
అర్జున్ రెడ్డి తరువాత బ్రేక్ తప్పదు
X
కోలీవుడ్ నటన కోసం ప్రాణం పెట్టె హీరో ఎవరైనా ఉన్నారా అంటే మొదట అందరికి విక్రమ్ గుర్తొస్తారని తెలుసు. అయితే ఆయన సినిమాలు ఎంత ప్రయోగాత్మకమైనవి గా ఉంటాయో తన కొడుకు ధృవ్ సినిమాలు కూడా అలానే ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉండాలని అనుకుంటున్నారు. అలాగే ధృవ్ కూడా అదే తరహాలో కథలను ఎంచుకోగలడని విక్రమ్ చెబుతున్నాడు.

ప్రస్తుతం ధృవ్ టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు. విలక్షణ దర్శకుడు బాల ఆ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా వారసులు ఒక సినిమా స్టార్ట్ చేశారంటే రిజల్ట్ తో సంబంధం లేకుండా వెంట వెంటనే సినిమాలను చేస్తుంటారు. కానీ ధృవ్ మాత్రం గ్యాప్ తీసుకుంటాడాని తెలుస్తోంది. రీసెంట్ గా విక్రమ్ ఆ విషయాన్ని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే ధృవ్ ఇంకా తన చదువును పూర్తి చేయలేదట.

డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ చేయనున్నాడాట. అర్జున్ రెడ్డి రీమేక్ తరువాత ఒక ఏడాది వరకు ఎలాంటి సినిమాలను ఒకే చేయకుండా తను అనుకున్న కోర్స్ చేసి ఆ తరువాత నెక్స్ట్ స్టెప్ ఎంటనే విషయం గురించి ఆలోచిస్తాడట ధృవ్. ప్రస్తుతం అమెరికాలో మెథడ్‌ యాక్టింగ్‌ గురించి నేర్చుకొంటున్నాడని విక్రమ్ తెలిపాడు. మరికొద్ది రోజుల్లో బాల దర్శకత్వంలో అర్జున్ రెడ్డి రీమేక్ స్టార్ట్ కాబోతోంది.