Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోకు ఆయన భార్యకు పాజిటివ్‌

By:  Tupaki Desk   |   15 July 2020 3:30 PM GMT
స్టార్‌ హీరోకు ఆయన భార్యకు పాజిటివ్‌
X
సినీ ప్రముఖులను కరోనా భయాందోళనకు గురి చేస్తూనే ఉంది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ కుటుంబంలో ఆయనతో పాటు ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. ఇంకా సౌత్‌ లో కూడా కరోనా కేసులు ఇండస్ట్రీలో నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా కన్నడ స్టార్‌ నటుడు ధృవ్‌ సర్జా కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. ఆయన కుటుంబం ఆయన భార్యతో పాటు మరో ఇద్దరికి కూడా పాజిటివ్‌ అంటూ రిపోర్ట్‌ వచ్చిందని బెంగళూరు మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ధృవ్‌ మరియు ప్రేరణలు ప్రస్తుతం కరోనా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ధృవ్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. నేను ఇంకా ప్రేరణ ఇద్దరం కూడా బాగానే ఉన్నాం. అనుమానంతో టెస్టు చేయించగా పాజిటివ్‌ వచ్చింది. గడచిన వారం రోజుల్లో మమ్ములను ఎవరైతే కలిశారో వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు వెంటనే పరీక్షలు చేయించుకుని స్వీయ నిర్భందంలోకి వెళ్లండి అంటూ ధృవ్‌ సర్జా విజ్ఞప్తి చేశాడు.

ఈ విపత్కర పరిస్థితుల పరిస్థితుల నుండి త్వరలోనే మా కుటుంబం బయట పడుతుందని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు. కర్ణాటకలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో ఉన్న సినీ ప్రముఖులు పలువురు కరోనా బారిన పడటంతో కొన్ని రోజుల క్రితమే సినీ స్టార్స్‌ ఉండే ఏరియాలను కంటోన్మెంట్‌ ఏరియాలుగా బెంగళూరు మున్సిపల్‌ కార్పోరేషన్‌ ప్రకటించింది.