Begin typing your search above and press return to search.

పాటతో కరోనాను భయపెడుతున్న డించక్ పూజ..!

By:  Tupaki Desk   |   21 March 2020 1:30 AM GMT
పాటతో కరోనాను భయపెడుతున్న డించక్ పూజ..!
X
డించక్ పూజ.. దేశమంతా కరోనాతో భయపడుతుంటే ఈమె మాత్రం తన పాటలతో భయపెడుతుంది. యూట్యూబ్ సంచలనంగా మారిన పూజ అసలు పేరు పూజ జైన్. తన పాటల ద్వారా డించక్ పూజగా పాపులర్ అయింది. కేవలం యూట్యూబ్ వీడియోలతోనే క్రేజ్ ను పొందిన పూజ 2017 బిగ్ బాస్ సీసన్-11లో కంటెస్టెంట్ గా పాల్గొని టీవీ ప్రేక్షకులకు కూడా తన ఘోరమైన గాత్రాన్ని పరిచయం చేసింది. పూజ పాట పాడిందంటే ఎవరికైనా దిమ్మ తిరిగిపోవాల్సిందే.. అంత దిగమింగలేని మాధుర్యాన్ని తన యూట్యూబ్ ద్వారా అభిమానులకు పంచుతుంది.

అయితే ఈ యూట్యూబ్ సెన్సేషన్ కొత్తగా కరోనా మీదనే కన్నేసి పాట కట్టేసింది. నిజానికి ఆ పాట వింటే కరోనా ఇండియాకు రాదేమో అన్పిస్తుంది. ఆమె పాట పాడుతుంటే చెయ్యి చిత్తూరుకు, కాలు కడపకు పోతున్న ఫీల్ మనకు కలుగుతుంది. ఇటీవల కరోనా పై పూజ పాడిన పాట నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాటలో కరోనా గురించి వివరిస్తూనే, కరోనా రాకుండా జాగ్రత్త పడండి అంటూ సందేశాన్ని అందిస్తుంది. కానీ డించక్ పూజ పాట అంటే మినిమం ఉంటది మరి అంటున్నారు నెటిజన్లు. కరోనా వైరస్ గురించి పక్కన పెడితే.. పూజ పాట వింటే ఎంతటి పిరికివాడికైనా ధైర్యం తన్నుకొస్తుందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాస్త వెరైటీగా ట్రై చేసిందని పూజ ధైర్యానికి కొందరు మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా కరోనా గురించి డించక్ పూజ ఏమంటుందో తెలుసుకోవాలంటే మాత్రం ఓసారి 'హోగా నా కరోనా' సాంగ్ పై లుక్కేయాల్సిందే..!