Begin typing your search above and press return to search.

సుశాంత్ సూసైడ్ కేసులో విచారణకు హాజరైన కరణ్ జోహార్ ప్రొడక్షన్‌ హౌజ్ సీఈఓ...!

By:  Tupaki Desk   |   29 July 2020 1:30 PM GMT
సుశాంత్ సూసైడ్ కేసులో విచారణకు హాజరైన కరణ్ జోహార్ ప్రొడక్షన్‌ హౌజ్ సీఈఓ...!
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో పలువురు సినీ ప్రముఖులను సుశాంత్ తో సన్నిహితంగా ఉండే వారిని పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరణ్‌ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్‌ సీఈఓ అపూర్వ మెహతా విచారణకు హాజరయ్యారు. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో అపూర్వ మెహతా తన స్టేట్మెంట్ ఇచ్చారు. సుశాంత్ చనిపోవడానికి ముందు విడుదలైన అతని చివరి చిత్రం 'డ్రైవ్' ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కింది. జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాకుండా నేరుగా నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసారు. దీనికి కరణ్ జోహార్ కారణమంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అపుర్వ మెహతా ఈ సినిమాకు సంబంధించి సుశాంత్ సింగ్ సైన్ చేసిన అగ్రిమెంట్ పేప‌ర్స్ కూడా పోలీసులకు చూపించినట్లు స‌మాచారం.

కాగా సుశాంత్ సూసైడ్ కేసులో ద‌ర్శ‌క‌నిర్మాత‌ కూడా వచ్చే వారం పోలీసుల ఎదుట హాజరుకానున్నాడని తెలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు క‌ర‌ణ్ జోహార్ మీద కూడా సోష‌ల్ మీడియా వేదికగా నెటిజన్స్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో 40 మందిని విచారించగా త్వరలోనే కరణ్ జోహార్ ని కూడా ఎంక్వైరీ చేసి తన స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత మహేష్‌ భట్‌.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా సుశాంత్ మరణానికి రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులను బాధ్యులను చేస్తూ సుశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పాట్నా పోలీసులు రియాని విచారించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.