Begin typing your search above and press return to search.

విఐపి-2 అలా ఉందట..

By:  Tupaki Desk   |   13 Aug 2017 11:46 AM IST
విఐపి-2 అలా ఉందట..
X
కోలీవుడ్ హీరోలు కథలతో చేసే ప్రయోగాలు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. కథ నచ్చితే చాలు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారని కూడా చూడకుండా స్టార్ స్టేటస్ ని వదిలి మరి కొత్తగా సినిమాలను తీస్తారు. అలా ప్రయోగాలు చేసి స్టార్ హోదాను అందుకున్న వారిలో ధనుష్ ఒకరు.

ఆయన గత చిత్రాలాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించినవే. ముఖ్యంగా 2014 లో వచ్చిన వీఐపీ (వెలఈళ్ల పట్టదారి) ధనుష్ కెరీర్ లో ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. మంచి విజయాన్ని అందించడంతో ఆ సినిమాను తెలుగులో కూడా డబ్ చేశారు. దీంతో మొదటి సారి ఈ సూపర్ స్టార్ అల్లుడు తెలుగులో మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఈ సారి మళ్లీ విఐపి సినిమాకు సీక్వెల్ గా తన మరదలు దర్శకత్వంలో విఐపి -2 ను నిర్మించాడు ధనుష్. రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ధనుష్ ఈ సినిమాకు కథ-మాటలను అందించాడు. కానీ మొదటి సినిమాలో ఉన్నంత స్కోప్ ఈ కథలో లేకపోవడంతో తమిళ అభిమానులు తిప్పి కొట్టారు. ముఖ్యంగా సౌందర్య రజనీకాంత్ స్క్రీన్ ప్లే- డైరెక్షన్ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.

మొదటి పార్ట్ లో అమలాపాల్-ధనుష్ మధ్య సాగిన ప్రేమాయణం రొమాన్స్ ఉన్నంతగా ఈ సినిమాలో అంతగా ఏమి లేదట. ఫస్ట్ పార్ట్ లో నిరుద్యోగిగా అలరించిన రఘువరన్ ఈ కథలో రోజు ఉద్యోగం చేసే వ్యక్తిగా మాత్రం అలరించలేకపోయాడు. ఇక సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటన లో కొత్తదనం ఏమి లేదు. ఆమె పాత్ర రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్రను పోలి ఉందని పెదవి విరుస్తున్నారు తమిళ్ ఆడియెన్స్.

ఎన్నో అంచనాలతో శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా పూర్తిగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాను త్వరలో తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి తమిళ ప్రేక్షకులను మెప్పించలేని రఘువరన్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.