Begin typing your search above and press return to search.

ధ‌నుష్ తెలుగు ప్ర‌మోష‌న్ మొద‌లైపోయింది

By:  Tupaki Desk   |   10 Nov 2016 7:25 AM IST
ధ‌నుష్ తెలుగు ప్ర‌మోష‌న్ మొద‌లైపోయింది
X
త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ తెలుగులో మార్కెట్ సంపాదించుకోవ‌డానికి కొన్నేళ్ల పాటు చేసిన ప్ర‌య‌త్నం ఎట్ట‌కేల‌కు గ‌త ఏడాది ఫ‌లించింది. త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన ‘వేల ఇల్ల‌ ప‌ట్ట‌దారి’ (వీఐపీ) డ‌బ్బింగ్ వెర్ష‌న్ ర‌ఘువ‌ర‌న్ బీటెక్ తెలుగులోనూ మంచి విజ‌యం సాధించింది. ధ‌నుష్ కు ఇక్క‌డ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత తెలుగులో రిలీజైన ధనుష్ సినిమాలు చాలా వ‌ర‌కు నిరాశ ప‌రిచాయి. ఐతే తాజాగా ధ‌ర్మ‌యోగి ప‌ర్వాలేద‌నిపించింది. ఇలాంటి త‌రుణంలో ‘వీఐపీ’ సీక్వెల్ మొద‌లుపెట్టాడు ధ‌నుష్‌. ఈ రోజే ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రుపుకుంది.

‘ర‌ఘువ‌ర‌న్ బీటెక్’ మంచి విజ‌యం సాధించిన నేప‌థ్యంలో తెలుగులోనూ ‘వీఐపీ-2’ మీద ఆస‌క్తి ఉంటుంది కాబ‌ట్టి.. ఇప్ప‌ట్నుంచే సినిమాను బాగా ప్ర‌మోట్ చేసి తెలుగులోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేయాల‌న్న ప్లాన్లో ఉన్న‌ట్లున్నాడు ధ‌నుష్‌. త‌మిళంతో పాటుగా తెలుగు పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేయించాడు. ‘వీఐపీ’ తెలుగు వెర్ష‌న్ కు ‘ర‌ఘువ‌ర‌న్ బీటెక్’ అని టైటిల్ మార్చిన‌ప్ప‌టికీ.. సీక్వెల్ కు మాత్రం ‘వీఐపీ-2’ అనే టైటిలే ఫిక్స్ చేశారు. ర‌ఘువ‌ర‌న్ ఈజ్ బ్యాక్ అంటూ దీనికి ట్యాగ్ లైన్ జోడించారు. క‌బాలి ప్రొడ్యూస‌ర్ క‌లైపులి థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధనుష్ కథ అందించడంతో పాటు మాటలు కూడా రాస్తుండటం విశేషం. స్క్రీన్ ప్లే, దర్శకత్వం క్రెడిట్ అత‌డి మ‌ర‌ద‌లు సౌందర్య తీసుకుంటోంది.