Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ లో #D43.. ఆ పని కూడా పూర్తి చేయనున్నాడా?

By:  Tupaki Desk   |   30 Jun 2021 8:00 AM IST
హైదరాబాద్‌ లో #D43.. ఆ పని కూడా పూర్తి చేయనున్నాడా?
X
తమిళ స్టార్‌ ధనుష్‌ తెలుగులో ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్ అయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈయన సినిమా అధికార ప్రకటన వచ్చింది. కేవలం శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే కాకుండా మరో ఇద్దరు దర్శకులతో కూడా తెలుగు సినిమాల విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్‌ కమ్ముల కథకు ఓకే చెప్పాడు. స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి కావాల్సి ఉంది. మరో ఇద్దరు తెలుగు దర్శకులు చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో పూర్తి కథను వినాల్సి ఉంది. జులై మొదటి వారం నుండి ధనుష్‌ 43వ సినిమా ను హైదరాబాద్‌ లో షూటింగ్‌ చేయబోతున్నారు.

ప్రతిష్టాత్మకంగా కార్తీక్‌ నరేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ధనుష్‌ 43 సినిమా షూటింగ్‌ ను హైదరాబాద్‌ లో రెండు మూడు వారాల పాటు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలోనే ధనుష్‌ మొదటి తెలుగు సినిమా స్క్రిప్ట్‌ వర్క్ ను శేఖర్‌ కమ్ములతో కలిసి పూర్తి చేయబోతున్నాడట. ఇక రంగ్ దే దర్శకుడు వెంకీ అట్లూరికి కూడా ధనుష్‌ అపాయింట్‌ మెంట్‌ ఇచ్చాడని.. ఆయన చెప్పబోతున్న కథను కూడా ధనుష్‌ వింటాడనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ధనుష్‌ హైదరాబాద్ లో ఉతన 43వ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటూనే తెలుగు దర్శకులు చెప్పబోతున్న కథలు మరియు స్క్రిప్ట్‌ ను ఫైనల్‌ చేయబోతున్నాడట.

ప్రతి దర్శకుడు కూడా ధనుష్‌ వంటి స్టార్‌ తో చేయాలనుకుంటాడు. ముఖ్యంగా ధనుష్‌ తో వర్క్‌ ను ప్రతి దర్శకుడు కూడా ఆస్వాదిస్తాడనే టాక్ ఉంది. దర్శకుడు చెప్పినట్లుగా చేసుకుంటూ పోయే స్టార్‌ ధనుష్‌. కాస్త స్టార్‌ డమ్‌ ఉన్న వారు కూడా దర్శకులకు ఎదురు చెబుతూ ఉంటారు. అలాంటిది ధనుష్‌ మాత్రం దర్శకులు ఎలా చెబితే అలా వింటాడు అనే టాక్ ఉంది. అందుకే ఆయన ఇన్ని ఎక్కువ సినిమాలు చేయగలిగాడు. తనకు తోచిన సలహాలు ఇస్తాడు కాని వాటిని రుద్దాలని మాత్రం చూడడు అంటూ ఆయనతో వర్క్‌ చేసిన దర్శకులు అంటూ ఉంటారు.