Begin typing your search above and press return to search.
అన్న కెరీర్ కోసం తమ్ముడు త్యాగమా?
By: Tupaki Desk | 24 Jun 2021 5:00 PM ISTతమిళ సూపర్ స్టార్ ధనుష్ కోలీవుడ్ లో వరుస విజయాలతో జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇంతలోనే ఊహించని ఓ డిజాస్టర్ ని ఎదుర్కొన్నాడు. ఇటీవల ఓటీటీలో రిలీజైన `జగమే తంత్రం`(జగమే తందిరం) విషయంలో తానొకటి తలిస్తే అన్న చందం అయ్యింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ధనుష్ కెరీర్ లో రాంగ్ ఛాయిస్ అని ప్రూవైంది. ప్రస్తుతం అతడు అవెంజర్స్ దర్శకద్వయం రస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న `ది గ్రే మ్యాన్` అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నాడు.
అమెరికాలో ఈ మూవీ చిత్రీకరణను ముగించుకుని తొందర్లోనే తదుపరి తమిళ చిత్రంపైనా దృష్టి సారించనున్నాడు. ధనుష్ అమెరికా నుంచి రాగానే తన సోదరుడు సెల్వరాఘవన్ తెరకెక్కించే మూవీలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. సెల్వరాఘవన్ తదుపరి చిత్రం నానే వరువెన్ ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ మూవీని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 20 నుండి ప్రారంభిస్తారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్. థాను నిర్మిస్తారు.
ధనుష్ ని హీరోగా పరిచయం చేస్తూ సెల్వరాఘవన్ `తుల్లువధో ఇళమై` తెరకెక్కించారు. ఆ తరవాత కాదల్ కొండెయిన్- పుదుపేట్టై- యారాడి నీ మోహిని- మయక్కం ఎన్నా చిత్రాలకు కలిసి పని చేశారు. ఇవన్నీ విజయవంతం అయిన సంగతి తెలిసిందే. అయితే అన్న సెల్వ రాఘవన్ కెరీర్ ఇటీవల డైలమాలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తన కోసం ధనుష్ ఓ మూవీ చేయదలిచారా? అన్నది ఆసక్తిగా మారింది.
ధనుష్ ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో అట్రాంగి రే అనే త్రిభాషా చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇటీవల శేఖర్ కమ్ములతో ఓ మూవీని ప్రకటించారు. అలాగే మరో మూడు చిత్రాలు క్యూలో ఉన్నాయి. తమిళ గ్యాంగ్ స్టర్ డ్రామా `జగమే తందిరమ్` నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.