Begin typing your search above and press return to search.

యంగ్ రజినీగా అల్లుడు క్యామియో

By:  Tupaki Desk   |   6 Jun 2017 8:05 AM GMT
యంగ్ రజినీగా అల్లుడు క్యామియో
X
ఇప్పుడు సౌత్ మీడియాలో సూపర్ స్టార్ రజనీ.. ఆయన అల్లుడు ధనుష్‌.. సెంటర్ పాయింట్ అయిపోయారు. తమ సినిమా రాజకీయ విషయాలతో లోకల్ నేషనల్ మీడియాను బాగానే నడిపిస్తున్నారు. ఇప్పుడు తన అల్లుడు - తమిళ్ టాలెంటెడ్ నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ సినిమాలలో నటించడమే కాకుండా కొన్ని సినిమాలుకు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. ‘వండర్ బార్' బేనర్ పై మామ గారితో సినిమా తీస్తున్నాడు ఈ కుర్రాడు.

కబాలి ఫేం పా.రంజిత్ డైరక్షన్లో మామ రజినీకాంత్ సినిమా ‘కాలా’ను ప్రొడ్యూస్ చేయడమే కాకుండా.. ఆ సినిమాలో మనోడు ఒక రోల్ కూడా చేయబోతున్నాడు. బొంబాయిలో పరిస్థితులు మారుతున్న వేళ.. తమిళంలో అప్పుడే తెరపైకి వచ్చిన ఒక యువ హీరో రజనీకాంత్.. మహారాష్ట్రకు చెందిన వాడు కావడంతో.. అక్కడ కూడా ఫాలోయింగ్ సంపాదించాడు. అ పాత్రను ఇప్పుడు స్వయంగా ధనుష్‌ తో చేయిస్తున్నారట. ఇప్పుడు రజినీకాంత్ ముంబాయ్ లో షూటింగ్ లో ఉన్నారు. ఎప్పటి నుండో ధనుష్ రజినితో నటించాలి అని ఆశ పడగా.. ఇప్పటికీ అతని కల ఆశ ఇలా తీరుతోంది. ఒక చిన్న నిడివి ఉన్న యంగ్ రజిని పాత్రలో రజిని స్టైల్ నడక తో అదరగొట్టనున్నాడట.

ఇకపోతే ఈ సినిమాలో రజినీకు సరసన బాలీవుడ్ హీరోయిన్ హుమా కూరేషీ నటిస్తున్నది కాని.. హీరోయిన్ ను మార్చే ఛాన్సుందని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ గ్యాంగ్ స్టార్ గా కనపడనున్నారు. ఇంతకు ముందు మాఫియా బ్యాక్ డ్రాప్లొ వచ్చిన సినిమాలు అన్నింటి కన్నా కాలా స్పెషల్ గా ఉంటుందట. లెటజ్ సీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/