Begin typing your search above and press return to search.

సార్ న్యూ పోస్టర్.. యాక్షన్ మోడ్ లో ధనుష్..!

By:  Tupaki Desk   |   24 Oct 2022 6:03 AM GMT
సార్ న్యూ పోస్టర్.. యాక్షన్ మోడ్ లో ధనుష్..!
X
తమిళ హీరో ధనుష్ తెలుగులో చేస్తున్న సినిమా సార్. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఆ సినిమాని హిందీ లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ మూవీ నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి సార్ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఆమధ్య వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. సార్ సినిమాలో ధనుష్ టీచర్ గా నటిస్తున్నాడని తెలిసిందే. దీపావళి సందర్భంగా సార్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. సార్ అంటే క్లాస్ అనుకుంటారని ఈసారి మాస్ పోస్టర్ తో వచ్చాడు ధనుష్.

సార్ లుక్ క్లాస్ అయినా సరే ఈసారి యాక్షన్ మోడ్ లో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. టక్ వేసుకుని మరీ రౌడీల పని పడుతున్నాడు హీరో ధనుష్. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన సార్ న్యూ పోస్టర్ అదిరిపోయింది. ఎడ్యుకేషన్ సిస్టం బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ కాన్సెప్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో ధనుష్ కి జోడీగా మళయాళ భామ సంయుక్త మీనన్ నటిస్తుంది.

భీమ్లా నాయక్, బింబిసార సినిమాల్లో నటించిన సంయుక్త మీనన్ రెండు సినిమాలు హిట్ అవడంతో అమ్మడికి ఇక్కడ క్రేజ్ పెరిగింది. ధనుష్ సార్ సినిమాతో సంయుక్త పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోనుందని చెప్పొచ్చు.

తెలుగులో తనకు మంచి మార్కెట్ ఉన్నా సరే ధనుష్ ఎందుకో టాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. తను తమిళంలో నటించిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవూంది. కానీ సరైన ప్రమోషన్స్ లేకపోవడం వల్ల సినిమా రిలీజైంది అన్న విషయం కూడా ఎవరికి తెలియట్లేదు.

రీసెంట్ గా ధనుష్ తిరు, నేనే వస్తున్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇదివరకు ఎలా ఉన్నా సార్ సినిమాతో తెలుగులో స్ట్రైట్ గా వస్తున్నాడు ధనుష్. సార్ సినిమా హిట్ పడితే ధనుష్ కూడా తెలుగులో స్టార్డం తెచ్చుకునే ఛాన్స్ ఉంది.

ధనుష్ సార్ సినిమా తర్వాత అసలైతే శేఖర్ కమ్ములతో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆ మూవీ ఎనౌన్స్ మెంట్ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీ క్యాన్సిల్ అయ్యిందని కూడా వార్తలు వస్తున్నాయి. వీటిపై అటు శేఖర్ కమ్ముల కానీ.. ధనుష్ దగ్గర నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.