Begin typing your search above and press return to search.

షాకిస్తున్న స్టార్ హీరో లుక్

By:  Tupaki Desk   |   30 April 2019 6:23 AM GMT
షాకిస్తున్న స్టార్ హీరో లుక్
X
విభిన్నమైన సినిమాలు చేస్తూ విభిన్న పాత్రలు పోషిస్తూ సాగిపోయే హీరో ధనుష్. మిడిల్ క్లాస్ అబ్బాయిలా 'రఘువరన్ బీ టెక్' లో నటించినా.. 'మారి' అంటూ లోకల్ డాన్ పాత్ర పోషించినా.. అప్పుడెప్పుడో 'ఆడుకాలం' అంటూ ఊరమాస్ సినిమా చేసి నేషనల్ అవార్డు సాధించినా.. అన్నీ రకాల పాత్రలు కవర్ చేస్తాడు ధనుష్. తాజాగా 'అసురన్' సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేసి ఆడియన్స్ కు భారీ షాక్ ఇచ్చాడు.

'అసురన్' ఫస్ట్ లుక్ లో ధనుష్ ను చూసి అసలు ఎవరూ గుర్తుపట్టలేం. అంత డిఫరెంట్ గా ఉన్నాడు. గుబురుగా ఉండే మీసాలు.. గడ్డంతో కనిపిస్తున్న ధనుష్ తలకు ఒక తువ్వాలు చుట్టుకొని.. పొడవు చేతులు ఉండే గోధుమ రంగు చొక్కా.. పంచె కట్టుకొని సీరియస్ గా నడుస్తూ ఉన్నాడు. ఇక చేతిలో పొడవాటి కత్తి.. మొహంపై.. షర్టుపై చిందిన రక్తం చూస్తుంటే విలన్ల భరతం పట్టిన తర్వాత మరో చోట సెకండ్ రౌండ్ వేసేందుకు రెడీ అయి వెళ్తున్నట్టుగా ఉంది. ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కుతోంది.

ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే మరోసారి ధనుష్ మహా నాటు సినిమా చేసినట్టు అనిపిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. వీ క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'వడ చెన్నై' ఫేమ్ వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ లో ఉందట. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.