Begin typing your search above and press return to search.

ధనుష్‌ - కమ్ముల మూవీ.. ఫ్లేవర్ విషయంలో క్లాష్‌

By:  Tupaki Desk   |   1 Oct 2021 12:30 AM GMT
ధనుష్‌ - కమ్ముల మూవీ.. ఫ్లేవర్ విషయంలో క్లాష్‌
X
టాలీవుడ్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. తమిళం మరియు తెలుగు లో ఏక కాలంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు లో డైరెక్ట్‌ సినిమా చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ నటించేందుకు ఓకే చెప్పాడు. వీరిద్దరి కాంబో మూవీ కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధనుష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ముగించిన తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ధనుష్‌ సినిమా అంటే తమిళ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది.

ఆయన నటించే ప్రతి సినిమాలో కూడా తమిళ ప్లేవర్‌ ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. ఆయన కట్టుబొట్టు మరియు ఆయన స్టైల్‌ అన్ని కూడా తమిళులను రిప్రజెంట్‌ చేసే విధంగా ఉంటాయి. అలానే ప్రేక్షకులు ధనుష్‌ ను ఊహించుకుంటారు. అలాంటి ధనుష్ ను పూర్తి విభిన్నంగా శేఖర్ కమ్ముల చూపించే ప్రయత్నం చేస్తే తమిళ ఆడియన్స్‌ ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది ప్రశ్న. గత కొన్ని రోజులుగా ఇదే విషయమై శేఖర్ కమ్ముల మరియు ధనుష్‌ ల మద్య జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్లేవర్ విషయంలో కాస్త తమిళ టచ్ ఇచ్చేలా స్క్రిప్ట్‌ మరియు స్క్రీన్‌ ప్లేను చేంజ్ చేయాలంటూ ధనుష్‌ కోరుతున్నాడని.. అందుకు శేఖర్‌ కమ్ముల నో చెప్పలేక ఓకే చెప్పలేక మదనపడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబో మూవీ తెలుగు లో రూపొందుతున్న కారణంగా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా సన్నివేశాలను కమ్ముల రాసుకున్నాడు. కాని తన తమిళ ఆడియన్స్‌ కోసం అంటూ ధనుష్ మార్పులు కోరుతున్నాడు.

వీరిద్దరి మద్య ఉన్నది చిన్న క్లాష్‌ అవ్వడం వల్ల అది అతి త్వరలోనే సర్దుకుంటుందని.. మరికొన్ని రోజుల్లోనే సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. లవ్‌ స్టోరీ సినిమా లో సమాజంలో ఉన్న సమయ్యలు మరియు కులం మతం అంతరాల గురించి చూపించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ధనుష్ గతంలోనే సినిమాలు చేయడం జరిగింది. ఎక్కువ కులం తక్కువ కులం అనే తారతమ్యాలు ఉండే కథతోనే కమ్ముల కొత్త సినిమా ఉంటుందని.. ధనుష్‌ మరోసారి అలాంటి పాత్రలో నటించేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందబోతున్న సినిమా కథ కులాలకు సంబంధం లేకుండా సాగుతుందని అంటున్నారు. కథ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వక పోవడంతో పాటు షూటింగ్‌ ను ఎప్పుడు మొదలు పెట్టేది.. సినిమా విడుదల ఎప్పుడు అనే విషయాలను మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే ఏడాదిలో ఈ క్రేజీ కాంబో మూవీ విడుదల అవ్వాలని ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆశిస్తున్నారు. తెలుగు ఆడియన్స్ ధనుష్‌ ను ఈసారైనా ఆధరిస్తారా అనేది చూడాలి. కోలీవుడ్‌ కు చెందిన ఇతర చిన్న హీరోలు టాలీవుడ్‌ లో మంచి ప్రభావం చూపించారు కాని ధనుష్‌ మాత్రం ఒకటి రెండు సినిమాలు తప్ప తెలుగు లో ఆకట్టుకున్న దాఖలాలు లేవు. అందుకే డైరెక్ట్‌ సినిమా తో ధనుష్‌ ఎటాక్ కు సిద్దం అయ్యాడు.