Begin typing your search above and press return to search.

ధనుష్‌ రికార్డ్‌.. అయినా మన మహేష్‌ నెం.1

By:  Tupaki Desk   |   13 Sep 2022 5:30 PM GMT
ధనుష్‌ రికార్డ్‌.. అయినా మన మహేష్‌ నెం.1
X
కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్ లో ఈయన ఫాలోవర్స్ సంఖ్య 11 మిలియన్ లకు చేరింది. కోలీవుడ్‌ లో ఈ మార్క్ ను చేరుకున్న హీరోలు ఏ ఒక్కరు లేరు. 11 మిలియన్ ల ఫాలోవర్స్ ను ట్విట్టర్ లో సంపాదించుకున్న ధనుష్ కోలీవుడ్‌ లో నెం.1 గా నిలిచాడు.

ఈ విషయంలో ధనుష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సౌత్‌ లో ఈ స్థాయిలో ఫాలోయింగ్‌ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. ధనుష్ కంటే మేమే పెద్ద స్టార్స్‌ అనుకునే వాళ్లు కూడా ఇప్పుడు ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో మా ధనుష్ తర్వాతే అన్నట్లుగా అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

ధనుష్‌ కోలీవుడ్‌ లో నెం.1 గా నిలిచాడు కానీ.. సౌత్‌ ఇండియా మొత్తంగా చూసుకుంటే ధనుష్‌ కి రెండవ స్థానం దక్కుతుంది. మొదటి స్థానంలో మన సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఉంటాడు. మహేష్ బాబు ఎప్పుడో పది మిలియన్ లు మరియు 11 మిలియన్ల ఫాలోవర్స్ ని క్రాస్ చేశాడు. ప్రస్తుతం మహేష్ ని ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాల 12.8 మిలియన్ లు.

బాలీవుడ్‌ హీరోల్లో చాలా మంది మహేష్ బాబు మరియు ధనుష్ వెనకే ఉన్నారు. సోషల్‌ మీడియాలో మహేష్ బాబు మరియు ధనుష్‌ ఫాలోయింగ్‌ కి ఇదే సాక్ష్యం. కోటికి పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఈ స్టార్‌ హీరోలు ముందు ముందు మరిన్ని ట్విట్టర్ రికార్డులు నమోదు చేయడం ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు.

ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే వరుసగా తమిళంలో నటిస్తూనే మరోవైపు తెలుగు.. హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు లో సార్ అనే సినిమా తో ధనుష్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో సినిమా ప్రారంభం కాబోతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.