Begin typing your search above and press return to search.
మామను కాపీ కొట్టబోతున్న స్టార్ హీరో..
By: Tupaki Desk | 21 April 2020 4:40 PM ISTకోలీవుడ్ ఇండస్ట్రీలో 'వేల ఇల్లా పట్టతారి'గా ధనుష్ సృష్టించిన రచ్చ మాములుది కాదు. కెరీర్ ప్రారంభం నుండి డిఫరెంట్ కాన్సెప్టులతో స్టార్ హీరోగా ఎదిగిన తీరు అభినందనీయం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ధనుష్ సొంతం. ఇండియన్ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ అల్లుడు అయినప్పటికీ ఎక్కడ కూడా ఆయన పేరు అడ్డుపెట్టుకోకుండా సొంతంగా ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లోనూ తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఏర్పరచుకొని సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్నారు ధనుష్. నటుడిగా.. నిర్మాతగా.. సింగర్ గా.. దర్శకుడిగా.. మల్టీ టాలెంటెడ్ ధనుష్ వరుస విజయాలతో అభిమానులను అలరిస్తున్నారు. 'రఘువరన్ బీటెక్'లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ధనుష్. 'మారి'లో లోకల్ డాన్‌గానూ మెప్పించారు. 'ధర్మయోగి'లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి విజయం అందుకున్నారు. సినిమాలో పాత్రకు తగ్గట్టు తనను తాను మలచుకోవడంలో ధనుష్ ముందుంటారు.
అయితే ప్రస్తుతం ధనుష్ ప్లాన్ చేస్తోన్న కొత్త సినిమాల జాబితాలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను రీమేక్ చేసే ఆలోచన కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. తలైవా రజనీ 1981లో నటించిన సూపర్ హిట్ మూవీ ‘నెట్రి కాన్’ సినిమాను ధనుష్ ఇప్పుడు రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఎస్పీ.ముత్తురామన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రజనీ డబుల్ రోల్ చేశారు. కాగా ఈ రీమేక్లో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. అపట్లో ఒరిజినల్ వెర్షన్లో నటించిన మేనక కీర్తి సురేష్ తల్లి కావడం విశేషం. ఇక ‘అసురన్, పటాస్’ ఇలా వరుసగా కొత్త కథలను ఎంచుకుంటున్న ధనుష్ ఇంకో రెండు కొత్త కథలను కూడా అంగీకరించాడట. వాటిలో మారి సెల్వరాజ్ సినిమా కథ కూడా కొత్తగా ఉంటుందట. అంతేకాకుండా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘జగమే తంత్రం’లో గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. కరోనా తగ్గాక రజిని సినిమా రీమేక్ సెట్స్ మీదకు తీసుకువెళ్తాడట. ఈ రీమేక్ చిత్రానికి దర్శకుడు ఎవరు, సినిమా ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.