Begin typing your search above and press return to search.
చైతూ సినిమా.. అక్కడ లేదు
By: Tupaki Desk | 12 Nov 2015 9:00 PM ISTఈ ఏడాది సౌత్ ఇండియాలో సెన్సేషనల్ హిట్టయిన సినిమాల్లో ‘ప్రేమమ్’ ఒకటి. ఈ మలయాళ సినిమాపై వేరే ఇండస్ట్రీలన్నీ కూడా ఆసక్తి చూపించాయి. ముందుగా తెలుగు రీమేక్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రాధాకృష్ణ ఈ సినిమా నిర్మించడానికి రంగం సిద్ధం చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు తమిళంలో సైతం ‘ప్రేమమ్’ రీమేక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలొచ్చాయి.
ప్రముఖ హీరో ధనుష్.. విజయ్ సేతుపతి హీరోగా ఈ సినిమాను తమిళంలో నిర్మించబోతున్నాడన్నారు. ఐతే ముందు రీమేక్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకున్నాడట ధనుష్. మామూలుగానే తమిళ ప్రేక్షకులు మలయాళ సినిమాల్ని బాగానే చూస్తారు. ‘ప్రేమమ్’ సినిమా చెన్నై సహా చాలా నగరాల్లో బాగా ఆడింది కూడా. పైగా ‘ప్రేమమ్’ లాంటి సినిమాను రీమేక్ చేయడం కూడా సరైన ఆలోచన కాదంటూ ధనుష్ అన్న సెల్వ రాఘవన్ సలహా కూడా ఇచ్చాడు. దీంతో ‘ప్రేమమ్’ రీమేక్ ఆలోచన పక్కనబెట్టేశాడట ధనుష్. తాను రీమేక్ రైట్స్ తీసుకోలేదని మీడియాకు క్లారిటీ కూడా ఇచ్చేశాడు.