Begin typing your search above and press return to search.
మళ్లీ తెరపైకి వచ్చిన నాగార్జున ‘రుద్ర’
By: Tupaki Desk | 9 Jun 2020 1:00 PM ISTహిందీలో భారీ చిత్రంలో నటిస్తున్న నాగార్జున తమిళంలో ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ‘రుద్ర’ సినిమాలో నటించేందుకు కమిట్ అయ్యాడు. తమిళంలో చాలా కాలం తర్వాత నాగార్జున ఈ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. త్వరలోనే నాగార్జున కూడా షూటింగ్ లో జాయిన్ అవుతాడు అనుకుంటున్న సమయంలో నిర్మాణ సంస్థ ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా షూటింగ్ ఆగిపోయింది.
ధనుష్ ను నమ్మి 80 కోట్ల బడ్జెట్ ను పెట్టేందుకు ఎవరు ముందుకు రాలేదు. దాంతో సినిమా పర్మినెంట్ గా అటకెక్కినట్లే అనుకున్నారు. ఇటీవల ధనుష్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి బడ్జెట్ తగ్గించాడట. దాంతో పాటు ఒక నిర్మాతను కూడా ఒప్పించాడట. ఆ కారణంగానే మళ్లీ ధనుష్ నాగార్జునల ‘రుద్ర’ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
భారీ చారిత్రాత్మక చిత్రంగా రుద్రను ధనుష్ తెరకెక్కించేందుకు గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మొదట రజినీకాంత్ ను ఈ సినిమాకు అనుకోగా కొన్ని కారణాల వల్ల ఆయన స్థానంలో నాగార్జున వచ్చి చేరాడు. నాగ్ తో షూటింగ్ అనుకుంటుండగా ఆర్థికపరమైన సమస్యలు. ఇప్పుడు మళ్లీ మొదలు అయితే ఈసారి మాత్రం ఎలాంటి అవరోదం లేకుండా స్పీడ్ గా పూర్తి చేయాలని ధనుష్ భావిస్తున్నాడట. త్వరలోనే ధనుష్ నుండి రుద్రకు సంబంధించిన అప్ డేట్ వస్తుందని అంతా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.