Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూజివ్: జూన్ రెండో వారంలో ధనుష్ 'జగమే తంత్రం'
By: Tupaki Desk | 23 April 2021 9:00 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లేటెస్టుగా 'కర్ణన్' మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే దీని కంటే ముందే కంప్లీట్ అయిన ''జగమే తంతిరమ్'' సినిమాని మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. కోవిడ్ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ చేయాలని ఇన్నాళ్లూ వాయిదా వేస్తూ వచ్చిన మేకర్స్.. చివరకు డిజిటల్ రిలీజ్ చేయడానికి డీల్ కుదుర్చుకున్నారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'నెట్ ఫ్లిక్స్' లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో వదిలిన సినిమా టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై మాత్రం క్లారిటీ అవ్వలేదు. ఈ నేపథ్యంలో మనకందిన సమాచారం ప్రకారం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'జగమే తంతిరమ్' చిత్రాన్ని జూన్ రెండో వారంలో విడుదల చేయడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది.
జూన్ 11 లేదా జూన్ 13 తేదీలలో 'జగమే తంతిరమ్' సినిమాని స్ట్రీమింగ్ కి పెట్టాలని నెట్ ఫ్లిక్స్ వారు డిస్కషన్ చేస్తున్నట్లు సమాచారం. రిలీజ్ డేట్ తో కూడిన ఈ సినిమా ట్రైలర్ ను మే 14న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. కాగా, 'జగమే తంతిరమ్' చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇది ధనుష్ కెరీర్ లో 40వ సినిమా. ఇందులో సురులి అనే గ్యాంగ్ స్టర్ గా ధనుష్ నటించగా.. ఆయనకు జోడీగా ఐశ్వర్యా లక్ష్మీ నటించింది. తెలుగులో ''జగమే తంత్రం'' అనే టైటిల్ తో రాబోతోంది. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించారు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.