Begin typing your search above and press return to search.

మామ బయోపిక్ లో అల్లుడు.. తలైవా ఫ్యాన్స్ కి ఇక పండగే

By:  Tupaki Desk   |   8 Nov 2020 9:31 AM GMT
మామ బయోపిక్ లో అల్లుడు.. తలైవా ఫ్యాన్స్ కి ఇక పండగే
X
రజనీకాంత్.. ఈ పేరులోనే ఓ పవర్ ఉంది. ఆయన స్టయిల్ అంటే పడి చచ్చేదేందరో. ఇండియాలోనే కాదు. జపాన్ మలేషియా వంటి దేశాల్లో కూడా డై హార్డ్ ఫ్యాన్స్. ఆయన కున్న చరిష్మా దేశంలోనే మరే హీరోకు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు కూడా రజనీయే. ఆయన మేనియా ఒక తమిళనాడుకే పరిమితం కాలేదు. టాలీవుడ్ అయినా బాలీవుడ్ లో అయినా ఆయన సినిమా వస్తోందంటే కటౌట్లు పెట్టే వాళ్లే. ఒక మామూలు కండక్టర్ స్థాయి నుంచి దేశంలోనే సూపర్ స్టార్ల కే సూపర్ స్టార్ గా మారడం ఒక్క రజనీకే చెల్లిందేమో. మూడేళ్ల కిందట రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీ ప్రకటించగా ఎన్నికల వేళ పార్టీ పెట్టాలనుకుంటున్న సమయంలో కరోనా ఉధృతి ఆయన రాజకీయ ప్రవేశాన్ని అయోమయంలోకి నెట్టింది. అసలు రాజకీయాల్లోకి రావాలా.. వద్దా.. అనే విషయమై ఆయన తొందర్లోనే క్లారిటీ ఇవ్వనున్నారు.

ఒక కండక్టర్ అయిన రజనీ సినిమాల్లోకి వచ్చి దేశంలోనే సూపర్ స్టార్ గా అవతరించడం అసామాన్యం. ఇప్పుడు ఆయన జీవితంపై ఓ బయోపిక్ తెరకెక్కనుంది. హీరో ఎవరో కాదు ఆయన అల్లుడు ధనుషే. ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ధనుష్ తో మాస్ చిత్రాల దర్శకుడు లింగుస్వామి ఈ బయోపిక్ చేయనున్నట్లు తమిళనాడు సినీ ఇండస్ట్రీలో మార్మోగుతుంది. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. ఈ వార్త విన్న రజనీ ఫ్యాన్స్ అయితే తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మామ బయోపిక్ ని అల్లుడు చేయడం అదిరింది అని అంటున్నారు. లింగుస్వామి రజనీ బయోపిక్ కు సంబంధించి స్క్రిప్ట్ సిద్ధం చేశారని, త్వరలోనే ఇది పట్టా లెక్కనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. లింగుస్వామికి మాస్ చిత్రాలను బాగా హ్యాండిల్ చేయగలరన్న పేరుంది. తెలుగులో డబ్బింగ్ అయినా ఆయన సినిమాలు, పందెంకోడి, ఆవారా సూపర్ హిట్లుగా నిలిచాయి.