Begin typing your search above and press return to search.

శైలజ సరోజగా మారిందిగా

By:  Tupaki Desk   |   9 Jan 2016 1:30 PM GMT
శైలజ సరోజగా మారిందిగా
X
శైలజ ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకుల నోళ్ళల్లో బాగా నానిన పేరు. నేను శైలజ సినిమాలో 'శైలజ.. శైలజ...' అంటూ దేవి అందించిన పాట కూడా ఇందుకు ఓ ప్రధాన కారణం. ఇక విషయానికొస్తే.. మొదటి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న శైలజ అలియాస్ కీర్తి సురేష్ ఇప్పుడు సరోజగా మారిందిప్పుడు.

తమిళంలో మైనా (ప్రేమఖైదీ), గుమ్కీ (గజరాజు) వంటి ప్రేమకథలను తెరకెక్కించిన ప్రభు సాలమన్ దర్శకత్వంలో వహిస్తున్న తాజా చిత్రం 'రైల్'. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఇటీవలే ఈ టైటిల్ ను ఖరారు చేశారు. పాంట్రీ కార్మికుడిగా ధనుష్ నటిస్తున్న ఈ సినిమాలో సరోజ అనే పాత్రలో కీర్తి సురేష్ కనపడనుంది. ప్రభు సాలమన్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ ఓ అందమైన ప్రేమకథను చూపించనున్నారు. ఢిల్లీ నుండి చెన్నై మధ్య ప్రయాణించే ఈ 'రైల్'లో వీరి ప్రేమ ఎలా చిగురించింది దాని తర్వాత పరిస్తుతులేమిటి అన్నది ఆసక్తికర అంశం. ఈ సంగతి ఇలా ఉంటె శైలజగా తెలుగు తెరకు పరిచయమైన కీర్తి ముందుగా నటించిన తెలుగు సినిమా 'ఐనా ఇష్టం నువ్వు' ఇప్పటివరకు విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం..!