Begin typing your search above and press return to search.

హాలీవుడ్ కోసం 60రోజులు కేటాయించిన ధ‌నుష్‌

By:  Tupaki Desk   |   17 Feb 2021 6:00 PM IST
హాలీవుడ్ కోసం 60రోజులు కేటాయించిన ధ‌నుష్‌
X
బాలీవుడ్ నుంచి ప‌లువురు స్టార్లు హాలీవుడ్ లో న‌టించారు. కానీ సౌత్ లో ఇలాంటి ఫీట్ వేసేది త‌క్కువే. మ‌న స్టార్లు పూర్తిగా లోక‌ల్ భాష‌కే ప్రాధాన్య‌త‌నిస్తుంటారు. ఇటీవ‌ల ఇరుగు పొరుగు మార్కెట్ల‌లోకి దూసుకెళ్లాల‌న్న ప్ర‌యత్నాలు మాత్రం చేస్తున్నారు. ఇక రొటీన్ సౌత్ స్టార్ల‌తో పోలిస్తే అటు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తూ త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తున్నారు.

ఓవైపు కిలాడీ అక్ష‌య్ కుమార్ తో క‌లిసి బాలీవుడ్ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తున్న ధ‌నుష్ మ‌రోవైపు హాలీవుడ్ మూవీతోనూ బిజీ కానున్నారు. విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు పొందిన హాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ ద్వయం జో - ఆంథోనీ రస్సోతో ధ‌నుష్‌ చేతులు కలిపిన సంగ‌తి తెలిసిందే.

`ది గ్రే మ్యాన్` పేరుతో తెర‌కెక్క‌నున్న‌ ఈ చిత్రం నెట్ ‌ఫ్లిక్స్ ఒరిజినల్ కేట‌గిరీలో తెర‌కెక్కించ‌నున్నారు. ఇది యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్. ర్యాన్ గోస్లింగ్ - క్రిస్ ఎవాన్స్ లాంటి పాపుల‌ర్ హాలీవుడ్ స్టార్లు కూడా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాలో న‌టిస్తున్నారు.

తాజా అప్ డేట్ ప్రకారం ధనుష్ `ది గ్రే మ్యాన్` మూవీ కోసం 60 రోజులు కేటాయించారు. త్వరలో లండన్ -యుకె స‌హా ఇతర నగరాల్లో తెర‌కెక్కించ‌నున్న‌ భారీ షెడ్యూల్ ‌లో ఆయన పాల్గొంటారు. ఈ థ్రిల్ల‌ర్ మూవీ స్క్రీన్ ప్లే రచయిత మార్క్ గ్రీనీ ఇటీవలి ఇంటర్వ్యూలో ధనుష్ ‌ విల‌న్ పాత్రను పోషిస్తున్నట్లు వెల్లడించారు. దీనిని బ‌ట్టి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న క్రేజీ ఎంపిక‌ల‌తో హాలీవుడ్ లోనూ ధ‌నుష్ స‌త్తా చాటే ఆలోచ‌న‌తో ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది.