Begin typing your search above and press return to search.
D44 టైటిల్ ఖరారు.. ముగ్గురు ముద్దుగుమ్మలతో ధనుష్ రొమాన్స్..!
By: Tupaki Desk | 5 Aug 2021 10:00 PM ISTనేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ వరుస సినిమాలతో ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో రెండు సినిమాలను విడుదల చేసిన ధనుష్.. ఇప్పుడు ఎనిమిది చిత్రాలను లైన్ లో పెట్టారు. తాజాగా #D44 చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటుగా నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. ధనుష్ హీరోగా నటిస్తున్న 44వ చిత్రానికి ''తిరుచిత్రంబలం'' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ''తిరుచిత్రంబలం'' టైటిల్ అనౌన్సమెంట్ వీడియోని విడుదల చేశారు. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ స్వయంగా ధనుష్ అందిస్తున్నారని తెలుస్తోంది. మిత్రన్ కె జవహర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మిత్రన్ గతంలో ధనుష్ తో 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' తమిళ రీమేక్ - 'ఆర్య' రీమేక్ - 'రెడీ' రీమేక్ చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు వీరి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కుతోంది.
'తిరుచిత్రంబలం' చిత్రంలో ధనుష్ సరసన నిత్యా మీనన్ - రాశి ఖన్నా - ప్రియా భవాని శంకర్ వంటి ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా - విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిథి మారన్ నిర్మిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ లో ''అత్రాంగి రే''.. హాలీవుడ్ లో ''ది గ్రే మ్యాన్'' అనే సినిమాల షూటింగ్ పూర్తి చేశారు. అలానే కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ''మారన్'' మూవీ చిత్రీకరణను చివరి దశకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో ''యుగానికొక్కడు 2''.. 'కర్ణన్' ఫేమ్ మారి సెల్వరాజ్ తో మరో సినిమా చేయనున్నాడు ధనుష్. అలానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. అంతేకాదు వెంకీ అట్లూరితో ధనుష్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.
https://twitter.com/sunpictures/status/1423259909261430787?s=08