Begin typing your search above and press return to search.

విన్నర్ విలన్.. హీరో వేషాలు

By:  Tupaki Desk   |   10 May 2017 6:33 AM GMT
విన్నర్ విలన్.. హీరో వేషాలు
X
సింగం2.. రోగ్.. విన్నర్.. వంటి సినిమాలతో ఠాకూర్ అనూప్ సింగ్ మనకు విలన్ గా బాగానే దగ్గరయ్యాడు. ఆడియన్స్ ను తన లుక్స్ పాటు విలనిజంతోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడీ యంగ్ విలన్ కొత్త సినిమా అంగీకరించాడు. అయితే.. ఇది విలన్ కేరక్టర్ కాకపోవడమే అసలు విషయం.

కబాలిలో రజినీ డాటర్ గా నటించిన సాయి ధన్సికతో కలిసి ఓ మూవీలో రొమాన్స్ చేసేందుకు ఠాకూర్ అనూప్ సింగ్ సిద్ధమవుతున్నాడు. కన్నడ-తెలుగు భాషల్లో బై లింగ్యువల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. తాను రియల్ లైఫ్ లో ఏ మాత్రం బ్యాడ్ గై కాదని.. చాలా మంచి వాడినని చెబుతున్న ఠాకూర్ అనూప్ సింగ్.. ఇప్పుడు తనకు హీరోగా ఓ అవకాశం రావడంపై తెగ సంతోషంగా ఉన్నాడు. తనలోని యాక్టింగ్ ట్యాలెంట్ ను మరింతగా చూపించేందుకు ఈ మూవీ హెల్ప్ అవుతుందని చెబుతున్నాడు.

'రోగ్ మూవీ ఆడియో ఫంక్షన్ లో నన్ను చూసిన దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్.. తన స్టోరీకి నేను హీరో కరెక్ట్ గా సూట్ అవుతానని భావించాడు. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కాగా.. ప్రేమతో లింక్ అయి ఉంటుంది. ప్రేమ కోసం ప్రాణం ఇచ్చే కేరక్టర్ చేస్తున్నాను. గతంలోనే తెలుగు డబ్బింగ్ చెప్పిన నేను.. ఇప్పుడు కన్నడ భాషలో కూడా డబ్బింగ్ చెప్పబోతున్నాను' అన్నాడు ఠాకూర్ అనూప్ సింగ్.