Begin typing your search above and press return to search.

ఖాకీ తొడిగిందంటే ఫైటింగుల హోరే

By:  Tupaki Desk   |   14 Oct 2015 3:30 PM GMT
ఖాకీ తొడిగిందంటే ఫైటింగుల హోరే
X
అర‌వాన్‌ - ప‌ర‌దేశీ వంటి సినిమాల‌తో తెలుగువారికి సుప‌రిచిత‌మైంది కోలీవుడ్ హీరోయిన్ ద‌న్షిక‌. హాట్ అప్పియ‌రెన్స్‌, న‌ట‌న‌లో గ్రేస్‌ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అయితే ఈ అమ్మ‌డికి ఆశించిన స్థాయిలో ఛాన్సులు రాలేద‌నే చెప్పాలి. న‌టించిన వాటిలో ఎక్కువ ప్ర‌యోగాలే. పైగా అవ‌న్నీ ఫ్లాపులే అవ్వ‌డంతో ధ‌న్షిక కెరీర్ ఆశించిన స్థాయిలో టేకాఫ్ తీసుకోలేక‌పోయింది. అయినా త‌మిళ్‌ లో ఈ అమ్మ‌డి క్రేజు ఏమాత్రం త‌గ్గ‌లేదు. నిజ జీవితంలో మార్ష‌ల్ ఆర్ట్స్‌ లో బ్లాక్‌ బెల్ట్ హోల్డ‌ర్ కాబ‌ట్టి ఇప్పుడు ఓ పోలీస్ క్యారెక్ట‌ర్‌ లోనూ హ‌ల్‌ చ‌ల్ చేస్తోంద‌న్న‌ది హాట్ టాపిక్‌.

ధ‌న్షిక‌... ప్ర‌స్తుతం ఓ రెండు సినిమాల్లో న‌టిస్తోంది. క‌బాలి చిత్రంలో ర‌జ‌నీకాంత్ త‌న‌య‌గా న‌టిస్తోంది. డ్ర‌గ్ అడిక్ట్ అయిన అమ్మాయిగా న‌టిస్తోంది. సేమ్ టైమ్ క‌ళ్యాణ్ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న కాత్త‌డిలో కాప్ రోల్ పోషిస్తోంది. పోలీస్ అంటే అట్టాంటి ఇట్టాంటి పోలీస్ కాదు. బెల్టు తెగిపోద్ది.. చొక్కాలు చినిగిపోతాయ్‌. రౌడీల‌కు త‌నంటే హ‌డ‌ల్‌. కాకీ చొక్కా వేసిందంటే దిమాక్ ఖ‌రాబే. ఫైటింగులే ఫైటింగులు అని చెబుతున్నాడు. త‌న‌కి ఎలానూ మ‌ర్ష‌ల్ ఆర్ట్స్ విద్య తెలుసు కాబ‌ట్టి వాట‌న్నిటినీ తెర‌పై చూపించ‌బోతోంది అన్న‌మాట‌. అన్న‌ట్టు అప్ప‌ట్లో ఓ సినిమా సెట్లో ఉండ‌గా కొంద‌రు ఆక‌తాయిలు త‌న‌ని ఆట‌ప‌ట్టించాల‌ని చూస్తే బాగానే బుద్ధి చెప్పింది అమ్మ‌డు. ఆ ఇన్సిడెంట్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేనిది. ధ‌న్షిక ప్ర‌స్తుతం కిట్నా అనే సినిమాలోనూ న‌టిస్తోంది. అదీ సంగ‌తి.