Begin typing your search above and press return to search.

కబాలి కూతురు భలే రెచ్చిపోయింది

By:  Tupaki Desk   |   27 Jun 2016 5:58 AM GMT
కబాలి కూతురు భలే రెచ్చిపోయింది
X
కబాలి మూవీలో రజినీకాంత్ ఓల్డేజ్ గెటప్ లోనే ఎక్కువ సేపు కనిపించనున్న విషయం తెలిసిందే. యంగ్ గెటప్ లో రజినీ కనిపించినా అది సినిమాకి కీలకమైన కాసేపు కనిపించే సన్నివేశాలు మాత్రమే. ఈ ఓల్డ్ రజినీ-రాధికా అప్టేలకు కూతురుగా ఓ కుర్ర హీరోయిన్ యాక్ట్ చేసింది.

కబాలిలో రజినీ కూతురు పేరు సాయిధన్సిక. ఈమె గతంలో కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు తెలుసు. ఆది పినిశెట్టి హీరోగా రూపొందిన అరవన్ అనే తమిళ చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ 'ఏకవీర' ద్వారా టాలీవుడ్ జనాలుక ధన్సిక పరిచయం అయింది. అయితే అప్పటి నుంచి తమిళ్ లో తప్ప తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు. అటు అవార్డులు, ఇటు ప్రేక్షకుల రివార్డులు కూడా బాగానే అందుకున్న ధన్సిక.. కబాలి తెలుగు వెర్షన్ ఆడియో లాంఛింగ్ లో అందాల విందు చేసి పారేసింది.

బంగారు వర్ణంలో మెరిసిపోతున్న డిజైనర్ వేర్ ను వేసుకొచ్చిన ధన్సిక.. లోపల ట్రాన్స్ పరెంట్ టాప్ ను ధరించింది. అందులోంచి లోపలి దుస్తుల కలర్ తో పాటు క్లీవేజ్ కనిపించేలా ధన్సిక చాలానే జాగ్రత్తలు తీసుకుంది. 'నాకు కబాలి మూవీ తెలుగులోకి ప‌ర్‌ఫెక్ట్ లాంచ్ గా భావిస్తున్నాను. ఇది నాకు డ్రీమ్ ప్రాజెక్ట్. ఏక‌వీర త‌ర్వాత తెలుగులో విడుద‌ల‌వుతున్న నా సినిమా ఇదే. ర‌జ‌నీకాంత్‌గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది' అని చెప్పింది ధన్సిక.