Begin typing your search above and press return to search.

కూతురు వయస్సున్న హీరోయిన్‌ తో...!

By:  Tupaki Desk   |   28 Aug 2018 10:37 AM GMT
కూతురు వయస్సున్న హీరోయిన్‌ తో...!
X
యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్‌ ‘గరుడవేగ’ చిత్రంతో సుదీర్ఘ విరామం తర్వాత సూపర్‌ హిట్‌ ను అందుకున్న విషయం తెల్సిందే. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం రాజశేఖర్‌ ఆలోచన విధానంను మార్చేసింది. విలన్‌ వేశాలు వేయాలనుకున్న రాజశేఖర్‌ ఆ చిత్రం తర్వాత మళ్లీ హీరోగానే ప్రయత్నించాలని నిర్ణయించుకుని చేస్తున్న చిత్రం ‘కల్కీ’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ చిత్రం హీరోయిన్‌ విషయంలో కాస్త గందరగోళం కనిపిస్తుంది.

విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం మొదట ఈ చిత్రం కోసం దర్శకుడు కాజల్‌ను సంప్రదించడం జరిగింది. కాజల్‌ భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో పాటు, పలు గొంతెమ్మ కోర్కెలు కోరింది. దాంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోవాలని దర్శకుడు భావించాడు. కాజల్‌ నో చెప్పడంతో అంజలిని ఈ చిత్రం కోసం సంప్రదించినట్లుగా ప్రచారం జరిగింది. అంజలి విషయంలో క్లారిటీ రాకుండానే ఈ చిత్రం కోసం దర్శకుడు సాయి ధన్సికను కూడా సంప్రదించినట్లుగా సోషల్‌ మీడియాలో పుకార్లు గుప్పుమంటున్నాయి. ‘కబాలి’ చిత్రంలో రజినీకాంత్‌ కు కూతురుగా నటించిన సాయి ధన్సిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

తెలుగులో సాయి ధన్సిక హీరోయిన్‌ గా రాజశేఖర్‌ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా ఒక తమిళ వెబ్‌ మీడియా సంస్థలో వార్త వచ్చింది. ఆ సినిమా రాజశేఖర్‌ మూవీ అంటూ కూడా ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. రాజశేఖర్‌ పెద్ద కూతురు శివాని ఏజ్‌ గ్రూప్‌ లో ఉండే సాయి ధన్సిక హీరోయిన్‌ గా రాజశేఖర్‌ కు జోడీగా నటించడం బాగుండదనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే సినీ వర్గాల్లో మరో ప్రచారం కూడా జరుగుతుంది. మెయిన్‌ హీరోయిన్‌ గా అంజలి నటించబోతుంది. రాజశేఖర్‌ కు జోడీగా అంజలి కనిపించబోతుంది. ముఖ్యమైన పాత్రలో సాయి ధన్సిక ఉండే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ‘కల్కీ’ హీరోయిన్‌ విషయంలో నెలకొన్న ఈ గందరగోళం ఎప్పటికి క్లారిటీ వస్తుందో..?