Begin typing your search above and press return to search.

రజినీని ఢీకొట్టే డాన్ ఎవరంటే..?

By:  Tupaki Desk   |   7 March 2016 7:24 AM GMT
రజినీని ఢీకొట్టే డాన్ ఎవరంటే..?
X
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తే ఆ సందడే వేరు. ఈ సందడి కోసం ఏడాది పైగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇంకో రెండు నెలల్లో రజినీకాంత్ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ‘కబాలి’ మేలో రిలీజవడం పక్కా. ఈ సినిమాలో రజినీకాంత్ గెటప్, దానికి సంబంధించిన స్టిల్స్.. ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ మధ్యే కొన్ని కొత్త స్టిల్స్ రిలీజ్ చేశారు. అవి ఇంకా ఆసక్తికరంగా ఉన్నాయి. అందులో రజినీ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు. హీరోయిన్ రాధికా ఆప్టే సైతం మిడిలేజ్ అవతారంలో ఆసక్తి రేపుతోంది.

ఈ కొత్త స్టిల్స్ లో ఓ అమ్మాయి గన్ పట్టుకుని రజినీకాంత్ ను బెదిరిస్తున్న దృశ్యం కూడా ఒకటుంది. ఈ కొత్త ఫేస్ ఎవరా అని తెలుగు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఐతే ఆ అమ్మాయి మనోళ్లకు కొత్తేమీ కాదు. తన పేరు ధన్సిక. ఇంతకుముందు ఆది పినిశెట్టి హీరోగా ‘ఏకవీర’ అనే సినిమా ఒకటి వచ్చింది గుర్తుందా? అందులో ధన్సికనే హీరోయిన్. తమిళంలో హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ధన్సిక.. ‘కబాలి’లో రజినీకాంత్ కూతురిగా నటిస్తుండటం విశేషం. మరి కూతురు తండ్రి మీద గన్ ఎక్కుపెట్టడం ఏంటి అని సందేహం రావచ్చు. సినిమాలో కూతురికి, తండ్రికి పడదట. ఆమె లేడీ డాన్ గా మారి.. తండ్రికే వ్యతిరేకంగా ముఠాను నడిపిస్తుందట. ఈ తండ్రీ కూతుళ్ల వార్ సినిమాలో చాలా స్పెషల్ గా ఉంటుందని చెబుతున్నాడు దర్శకుడు పా రంజిత్.