Begin typing your search above and press return to search.

ఏం చూపిస్తోంది ధనరాజ్‌??

By:  Tupaki Desk   |   13 July 2016 11:52 AM GMT
ఏం చూపిస్తోంది ధనరాజ్‌??
X
ఇప్పుడు కమెడియన్‌ ధనరాజ్‌ హీరోగా రూపొందిన మరొక సినిమా వస్తోంది. ''బంతిపూల జానకీ'' అంటూ మనోడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే కమెడియన్లు ఎవ్వరూ హీరోలుగా సక్సెస్ అవ్వడానికి చేయనన్నిసార్లు ధనరాజ్ ప్రయత్నాలు చేయడంతో.. అందరూ ఈ సినిమాతోనైనా హిట్టు కొడతాడని అనుకుంటున్నారు.

ఇదంతా ఇలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో తెగ హల్ చల్‌ చేస్తోంది. ఈ స్టిల్ చూస్తుంటే.. అసలు ఏమని అర్ధం చేసుకోవాలో తెలియక కంగారుపడాల్సిందే. అక్కడ చూడండి.. హీరోయిన్‌ దీక్షా పంక్త్ ఉందే.. ఆ పిల్ల టీ షర్టు లేపి మరీ ధనరాజ్ కు ఏదో చూపిస్తోంది. అక్కడేమన్నా సిక్స్ ప్యాక్ ఉందా లేకపోతే ఏదన్నా తేలు కట్టిందో.. అసలు ఈ పిల్ల ఎందుకు ఇలా చూపిస్తోంది అనేది ఇప్పుడు టాకింగ్‌ పాయింట్. మొత్తానికి కమర్షియల్ ఎలిమెంట్లను ఈసారి ధనరాజ్ కాస్త గాట్టిగానే వాడేశాడనమాట.

ఇకపోతే ఈ సినిమాతో ఈ స్పయిసీ హీరోయిన్ కు కూడా బ్రేకొస్తుందా? అది కూడా చూడాల్సిన విషయమే. జూనియర్‌ ఉదయబానుగా పాపులర్ అయిన ఈ భామ.. టాలీవుడ్ లో వరుసపెట్టి చాలా సినిమాలు చేసేస్తోంది కాని.. బ్రేక్ మాత్రం రావట్లేదు.