Begin typing your search above and press return to search.

దేవిశ్రీపై ధన్ రాజ్ కబుర్లు

By:  Tupaki Desk   |   13 Nov 2017 5:30 PM GMT
దేవిశ్రీపై ధన్ రాజ్ కబుర్లు
X
దేవి శ్రీ ప్రసాద్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన చర్చే జరుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ పై చాలానే విమర్శలు వస్తున్నాయి. ఒక శవంతో ఇలా ఎవరైనా ప్రవర్తించగలరా అంటూ.. మేకర్స్ ను దుమ్మెత్తిపోస్తున్న వారు కూడా ఉంటున్నారు.

అయితే.. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ధన్ రాజ్ మాత్రం.. తమ సినిమాలో చాలా కంటెంట్ ఉంటుందని చెబుతున్నాడు. అసలు ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అంటున్న ధన్ రాజ్.. 'నేను మార్చురీలో పని చేసే వ్యక్తిగా నటించాను. ఓ ప్రముఖ హీరోయిన్ శవం మార్చురీకి వస్తే.. ఆ శవంతో నేను.. మరో ఇద్దరు స్నేహితులం కలిసి ఏం చేశామన్నదే సినిమా స్టోరీ. ఇప్పటికే టైటిల్ కు.. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీలో పలువురికి సినిమాను స్క్రీనింగ్ చేసి చూపించాం. అందరికీ విపరీతంగా నచ్చింది. సినిమా సక్సెస్ పై మాకు బోలెడంత నమ్మకం ఉంది' అంటున్న ధన్ రాజ్.. దర్శకుడు శ్రీ కిషోర్ ఎంతో ప్రతిభ కలవాడని.. సినిమాను కేవలం ఇరవై రోజుల్లోనే పూర్తి చేయడమే కాదు.. చక్కని ఔట్ పుట్ అందించాడని చెబుతున్నాడు.

దేవి శ్రీ ప్రసాద్ మూవీ ట్రైలర్ పై చాలామంది విరుచుకుపడుతున్న అంశం కూడా తనకు తెలుసు అంటున్న ధన్ రాజ్.. అదే అసలు ట్విస్ట్ అని.. సినిమా చూస్తే వారి అభిప్రాయాలను తప్పకుండా మార్చుకుంటారని నమ్మకంగా చెబుతున్నాడు. ఈ సినిమాలో నటించాల్సిందిగా చాలామంది హీరోయిన్స్ ను అడిగినా ఎవరూ ఒప్పుకోలేదని.. అయినా ఎంతో కష్టపడి ఈ సినిమాను దర్శకుడు శ్రీకిషోర్ కంప్లీట్ చేశాడని చెబుతున్నాడు ధన్ రాజ్.