Begin typing your search above and press return to search.

బక్క కమెడియన్ కమల్ ని దాటేస్తాడా?

By:  Tupaki Desk   |   9 Nov 2015 10:30 PM GMT
బక్క కమెడియన్ కమల్ ని దాటేస్తాడా?
X
జబర్దస్త్ గేమ్ షో చూసే ప్రేక్షకులకు ధనరాజ్ గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. చీపురుపుల్లలాంటి శరీరంతో, కీచు గొంతుతో తనకంటూ సాధ్యమైన క్రియేటివ్ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తాడు. ధనరాజ్ ఈ మధ్య అడపాదడపా కొన్ని సినిమాలలో లీడ్ టైపు రోల్స్ సైతం పోషించాడు.

అయితే కంటెంట్ పరంగా ఎలావున్నా అసలు తన సినిమాలకు క్రేజ్ రాకపోవడంతో ధనరాజ్ ఆ వైపుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. స్పూఫ్ చేసినా, ఎన్ని వేషాలు వేసైనా తనకంటూ ప్రేక్షకుల నుండి గుర్తింపు తెచ్చుకోవాలని తపిస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా త్వరలో పనిలేని పులిరాజు అనే సినిమాతో మన ముందుకు రానున్నట్టు సమాచారం.

ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే అమీర్ ఖాన్ పి.కే కామెంట్ చేసిన ధనరాజ్ ఈ సినిమాలో ఏకంగా 13విభిన్న అవతారాలలో కనబడనున్నట్టు తెలుస్తుంది. ఈ వార్తే గనుక నిజమైతే దశావతారంలో కమల్ పోషించిన 10పాత్రల రికార్డుని మన ధనరాజ్ చేరిపెసినట్టే.. పోలిక కష్టంగా వున్నా ఇది నిజమండి.. నమ్మక తప్పదండి..