Begin typing your search above and press return to search.

వాళ్లతో నాకంత చనువు ఉంది : రవితేజ

By:  Tupaki Desk   |   22 Dec 2022 5:55 AM GMT
వాళ్లతో నాకంత చనువు ఉంది : రవితేజ
X
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం 'ధమాకా' రేపు థియేటర్లలో సందడి చేయనుంది. రవితేజ మార్క్ తో పుల్ అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో 'ధమాకా'ను దర్శకుడు త్రినాథ నక్కిన తెరకెక్కించాడు. ధమకా ట్రైలర్ చూస్తేనే ప్రేక్షకులకు ఈ విషయం అర్థమవుతోంది. ఇటీవల ప్రీ రిలీజ్ ను గ్రాండ్ గా జరుపుకున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుందని రవితేజ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ధమాకా రేపు థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో మూవీ మేకర్స్ అదిరిపోయే ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరో రవితేజ తనతో పని చేసిన ముగ్గురు దర్శకులతో కలిసి ఓ ఇంటర్వ్యూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరి మధ్య 'ధమకా' ముచ్చట్లతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చాయి. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో తమదైన శైలిలో చర్చించుకుంటున్నారు.

దర్శకుడు బాబీ రవితేజతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. రవితేజ తనపై ఎంతో నమ్మకంతో దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చారని తెలిపారు. ఆయన రుణం జీవితాంతం తీర్చుకోలేనిదని వాపోయాడు. ఆయనే తనకు ఇండస్ట్రీలో పెద్ద సపోర్టు అంటూ బాబీ వ్యాఖ్యానించాడు.

డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ తాను రవితేజకు సోదరుడని ప్రజలు తికమక పడేవారని గుర్తు చేశారు. వెంకీ మూవీ మేకింగ్ సమయంలో ఇలాంటి ఘటన జరిగిందంటూ ఆ విషయాన్ని తోటి దర్శకులతో గోపించంద్ పంచుకున్నాడు. అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ తాను తీసిన 'పటాస్' మూవీకి మొదట హీరోగా రవితేజనే అనుకున్నట్లు చెప్పారు.

రవితేజ దర్శకులతో ఫ్రెండ్లీగా ఉంటారన్నారు. తన సినిమా పూర్తయిన తర్వాత కూడా దర్శకులతో ర్యాపోను కంటిన్యూ చేస్తారని వెల్లడించారు. ఒక మాటలో చెప్పాలంటే రవితేజ ది గ్రేట్ అంటూ ప్రశంసించారు. ధమాకా ప్రీ క్లైమాక్స్ థియేటర్లో ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇవ్వబోతుందని దర్శకుడు తెలిపారు.

రవితేజ మాట్లాడుతూ ధమాకా మూవీ అభిమానులకు ఆధ్యంతం ఎంటర్టైన్మెంట్ పంచుతుందన్నాడు. ధమాకా మూవీని మ్యూజిక్ పెద్ద అసెట్ అవుతుందని.. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ మోస్ట్ అండర్ రేట్ చేసిన కంపోజర్ అని అన్నారు. ధమాకా తర్వాత బీమ్స్ బీజీ కంపోజర్ గా మారుతాడని.. అతడు అద్భుతమైన ట్యూన్ మేకర్ అంటూ కితాబిచ్చాడు. అలాగే ఈ ముగ్గురు దర్శకులతో ఏదైనా పంచుకునే చనువు ఉందని రవితేజ వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.