Begin typing your search above and press return to search.

రవితేజ ఈజ్ బ్యాక్.. ఫ్యాన్స్ కు 'ధమాకా' పండగే..!

By:  Tupaki Desk   |   22 Dec 2022 7:12 AM GMT
రవితేజ ఈజ్ బ్యాక్.. ఫ్యాన్స్ కు ధమాకా పండగే..!
X
హీరో రవితేజ హీరోయిన్ శ్రీలీల జంట నటించిన చిత్రం 'ధమకా'. డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ మూవీ ప్రేక్షకులకు ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ పంచుతుందని హీరో రవితేజ సైతం బలంగా నమ్ముతుండటంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ధమాకా మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ఈ సినిమాను దర్శకుడు త్రినాథ తిక్కన మాస్ మాస్ రాజ్ అభిమానులను అలరించేలా తీర్చిదిద్దినట్లు కన్పిస్తోంది. ఈ సినిమాలో అభిమానుల కోసం ప్రత్యేక సీన్లు దర్శకుడు త్రినాథ తిక్కన రచయిత ప్రసన్న అడిగి మరీ రాయించుకున్నారు.

ఈ సీన్స్ సినిమాకు హైలెట్ గా ఉండటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మాస్ మహారాజ్ నటన.. శ్రీలీల అందచందాలు.. మాస్ స్టెప్పులు అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్ అందించిన సంగీతం సినిమాకు అడ్వాంటేజ్ మాతుందని ధమకా టీం భావిస్తోంది.

ఇక ఈ మూవీ ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయమనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సినిమా రవితేజ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ కాబోతుందనే కాన్ఫిడెన్స్ ఆయనలో కన్పించింది.

రవితేజ నటించిన 'కిక్' మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది. అయితే ఆ తర్వాత 'క్రాక్' ముందు వరకు వచ్చిన సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. క్రాక్ తర్వాత అదే ట్రెండ్ కొనసాగించాలని రవితేజ భావించినా అది పెద్ద వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు త్రినాథ తిక్కనపై నమ్మకంతో 'ధమాకా' మూవీ చేశారు.

మూవీ మేకర్స్ ఈ చిత్రం కోసం చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే 'ధమాకా' హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో రవితేజలో ఎన్నడూ లేని కాన్ఫిడెన్స్ ఈ సినిమాలో కన్పిస్తోంది. ఈ క్రమంలోనే రేపు థియేటర్లలో రాబోతున్న 'ధమాకా'తో మునుపటి రవితేజ మళ్లీ మన ముందుకు వస్తాడని అన్పిస్తోంది. అలాగే ఈ సినిమా బుకింగ్స్ సైతం అదిరిపోయేలా జరుగుతుండటం మూవీకి ప్లస్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.