Begin typing your search above and press return to search.

ధాక‌డ్ టీజ‌ర్: కంగ‌న అరాచ‌కం వ‌న్ ఉమెన్ షో!

By:  Tupaki Desk   |   12 April 2022 1:02 PM GMT
ధాక‌డ్ టీజ‌ర్: కంగ‌న అరాచ‌కం వ‌న్ ఉమెన్ షో!
X
బాలీవుడ్ క్వీన్ కంగ‌న ప్ర‌ధాన పాత్ర‌లో ర‌జ్నీష్ ఘాయ్ గ‌హై ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధాక‌డ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే కంగ‌న మ‌రో అద్భుతం చేయ‌బోతుంద‌ని అంచ‌నాలు మొద‌య్యాయి. భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్స్ సినిమాలో ప్ర‌ధాన అస్సెట్ గా నిలుస్తాయ‌ని కంగ‌న హింట్ ఇవ్వ‌డంతో సినిమాపై అంకంత‌కు బ‌జ్ పెరిగిపోయింది. తాజాగా మేక‌ర్స్ చిత్ర టీజ‌ర్ ని రిలీజ్ చేసారు.

టీజ‌ర్ ని ఆద్యంతం యాక్ష‌న్ సీక్వెన్స్ తో నింపేసారు. టీజ‌ర్ మొద‌లు నుంచి ముగింపు వ‌ర‌కూ పోరాట స‌న్నివేశాలే హైలైట్ అవుతున్నాయి. ప్ర‌త్యర్ధుల‌పై కంగ‌న‌ బుల్లెట్లు మోత‌...కంగ‌న క‌త్తి పోట్లు ఆద్యంతం ఆక‌ట్టుకుంటున్నాయి. పూర్తిగా ఇదొక స్పై థ్రిల్ల‌ర్ లా హైలైట్ అవుతుంది. విజువ‌ల్స్ అద్భుతంగా ఉన్నాయి. బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ కి ఏమాత్రం తీసిపోకుండా కంగ‌నా చింపేసింద‌ని చెప్పొచ్చు.

ఇందులో కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్ల‌కు ఏకంగా 25 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసారు. కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్ లో వార్ హీరోల్నే త‌ల‌పిస్తుంది. ఏజెంట్ అగ్ని పాత్ర‌లో కంగ‌న మార్వెల్ యెక్క్ బ్లాక్ విడోతో పోలిక‌ల్ని క‌లిగి ఉంది. కంగ‌న ఆహార్యం అద్యంతం ఆక‌ట్టుకుంటుంది. బీజీఎమ్ హైలైట్.

టీజ‌రే ఈ రేంజ్లో ఉందంటే? ట్రైల‌ర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టి నుంచి ఎగ్టైట్ మెంట్ త‌ప్ప‌నిస‌రి. మేకింగ్ ప‌రంగా సినిమా హైలైట్ గా నిలిచేలా క‌నిపిస్తుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్- దివ్య‌ద‌త్ కూడా న‌టించారు. అయితే టీజ‌ర్ లో వారి పాత్ర‌ల్ని రివీల్ చేయ‌లేదు. పూర్తిగా కంగ‌న వ‌న్ ఉమెన్ షో టీజ‌ర్ గా వ‌దిలారు.

ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. అన్ని ప‌నులు పూర్తిచేసి మే 20న‌ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా కేట‌గిరిలో సినిమా రిలీజ్ కానుంది. హిందీతో పాటు..తెలుగు..త‌మిళం..మ‌ల‌యాళం భాష‌ల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.