Begin typing your search above and press return to search.

ధాక‌డ్ ట్రైల‌ర్: కంగ‌న క‌ళ్లు చెదిరే విన్యాసాలతో మైండ్ బ్లాక్

By:  Tupaki Desk   |   29 April 2022 1:09 PM GMT
ధాక‌డ్ ట్రైల‌ర్: కంగ‌న క‌ళ్లు చెదిరే విన్యాసాలతో మైండ్ బ్లాక్
X
రెసిడెంట్ ఈవిల్ ఇవా జోవిచ్ లా .. వండ‌ర్ ఉమెన్ గాల్ గాడోట్ లా చెల‌రేగేందుకు ఇండియ‌న్ సినీప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రున్నారు? అని వెతికితే ఒకే ఒక్క‌రిని ఖాయం చేసుకోవ‌చ్చు. ఇంత‌కీ ఎవ‌రా ఒక్క‌రు? అంటే క్వీన్ కంగ‌న ర‌నౌత్. తాజాగా రిలీజైన ధాక‌డ్ ట్రైల‌ర్ ని వీక్షిస్తే యాక్ష‌న్ కి ప‌ర్యాయ‌ప‌దంలా క‌నిపిస్తోంది కంగ‌న‌. అస‌లు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ డ్ సూప‌ర్ హీరో క్వాలిటీస్ కంగ‌న‌లో ఉన్నాయ‌ని అంతా అంగీక‌రించాల్సి ఉంటుంది ఈ ట్రైల‌ర్ చూశాక‌.

శ‌రీరం నుంచి ఆత్మ‌ను విడ‌దీయ‌డ‌మే నా బిజినెస్ అంటూ కంగ‌న చెల‌రేగుతున్న తీరు వారియ‌ర్ లా వెప‌న్స్ ప‌ట్టుకుని యుద్ధ‌రంగంలోకి దూసుకెళుతున్న తీరు ప్ర‌తిదీ న‌భూతోన‌భవిష్య‌తి. ఈ చిత్రంలో కంగ‌న ఒక స్పై ఏజెంట్ పాత్ర‌లో న‌టిస్తోంది. దేశంలో రాజ‌కీయాలు కుంభ‌కోణాలు అవినీతి దుష్ఠ‌త్వం ఇలా ప్ర‌తిదానిని క‌థ‌లో ట‌చ్ చేసార‌ని అర్థ‌మ‌వుతోంది. అర్జున్ రాంపాల్ క్రూర‌మైన ప్ర‌తినాయ‌కుడిగా ఇందులో క‌నిపించ‌నున్నాడు. ఇక ట్రైల‌ర్ లో చూపించిన ఒక్కో యాక్ష‌న్ బ్లాక్ మైండ్ బ్లాంక్ చేసేసాయంటే అతిశ‌యోక్తి కాదు.

యుద్ధ రంగంలో శ‌త్రువుల‌కు ఎద‌రెళుతూ క‌త్తులు దూస్తూ ఏజెంట్ అగ్ని (కంగ‌న) విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు భారీ మెషీన్ గ‌న్స్ తో ఏకే 47 రైఫిల్స్ తో విరుచుకుప‌డుతూ అసాధార‌ణ విన్యాసాలు చేస్తూ సిస‌లైన ఇండియ‌న్ వెర్ష‌న్ సూప‌ర్ హీరోలా క‌నిపించింది కంగ‌న‌. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల చేస్తార‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

ఏజెంట్ అగ్ని ఫైరింగ్

మోస్ట్ అవైటెడ్ యాక్ష‌న్ మూవీ ధాకడ్ ట్రైలర్ ఆద్యంతం మెరుపులే మెరుపులు. ఈ చిత్రం ఆద్యంతం ఒళ్లు గ‌గుర్పొడిచే యాక్ష‌న్ విన్యాసాల‌తో ప్ర‌త్యేకంగా కనిపించింది. 2 నిమిషాల 47 సెకన్ల ట్రైలర్‌లో ఏజెంట్ అగ్ని (కంగనా) - రుద్రవీర్ (అర్జున్ రాంపాల్) అతని సన్నిహితులైన దివ్య దత్తా వంటి వారి సారథ్యంలోని దుర్మార్గుల సైన్యాన్ని హతమార్చడం ద్వారా మానవ అక్రమ రవాణా అనే చెడును అంతం చేయాలనే అగ్ని(కంగ‌న‌) పాత్ర‌ లక్ష్యం.

2019 మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ తర్వాత పూర్తి స్థాయి యాక్షన్ ఫిల్మ్ తో కంగ‌న రనౌత్ చేసిన రెండవ ప్రయత్నం ఇది. ఈ మూవీపై త‌ను పూర్తి నమ్మకంతో క‌నిపిస్తోంది. ఈ చిత్రంలో రనౌత్ హత్యాకాండ వార్ నేప‌థ్యం యాక్ష‌న్ చిత్రాల‌ను ఆద‌రించేవారికి స్పెష‌ల్ ట్రీట్ అనే చెప్పాలి. అగ్ని ఒక‌ ప్రో లాగా చెడ్డవారిని చంపుతుంది. కంగనాతో పాటు అర్జున్ రాంపాల్ కూడా చెప్పుకోదగ్గ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. విల‌న్ పాత్రలో అతని రోల్ కూడా ఆక‌ట్టుకుంటోంది. దివ్య దత్తా కూడా భయంకరంగా ఉంది. త‌న పాత్ర ఈ చిత్రానికి ఆశ్చర్యకరమైన ప్యాకేజీ గా ఉంటుందని అర్థ‌మ‌వుతోంది.

హై ఆక్టేన్ ఛేజింగ్ లు.. హృదయాన్ని కదిలించే ఎమోష‌న్.. భయంకరమైన రక్తపాతం.. భీక‌ర భ‌యాన‌క వాతావ‌ర‌ణం న‌డుమ ధాక‌డ్ స్టోరీ ర‌న్ అవుతోంది. ట్రైల‌ర్ తో ధాకడ్ పై ఆస‌క్తి పెరిగింద‌ని చెప్పాలి. ఏజెంట్ అగ్నిగా కంగనా విభిన్న రూపాలను ప్రదర్శించిన తీరు మెప్పిస్తోంది. ఆమె ప్రతి అవతారాన్ని పిచ్-పర్ఫెక్ట్ రియలిజంతో డిజైన్ చేశార‌ని తెలుస్తోంది.