Begin typing your search above and press return to search.
రాక్ స్టార్ దేవి శ్రీ 'సామ్రాట్' గా మారాడు
By: Tupaki Desk | 14 Aug 2021 5:00 PM ISTటాలీవుడ్ మరియు కోలీవుడ్ లో స్టార్ ల సూపర్ స్టార్ ల సినిమాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. చిన్న వయసులో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ కు అభిమానులు రాక్ స్టార్ అంటూ పేరు పెట్టారు. ఆ పేరుకు తగ్గట్లుగా దేవిశ్రీ ప్రసాద్ యూత్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటూ వరుసగా మ్యూజికల్ హిట్స్ తో దూసుకు పోతున్నాడు. తాజాగా ఈయన సంగీత సారథ్యంలో రెడీ అయిన పుష్ప సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులు ఈ మ్యూజిక్ వీడియోను తెగ ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ స్థాయిని మరో లెవల్ కు తీసుకు వెళ్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇదే సాంగ్ తో దేవిశ్రీ ప్రసాద్ కు కొత్త ట్యాగ్ ను పుష్ప యూనిట్ ఇచ్చింది.
ఇప్పటి వరకు రాక్ స్టార్ గా అభిమానులను అలరిస్తూ వస్తున్న దేవిశ్రీ ప్రసాద్ కు సామ్రాట్ ఆఫ్ మ్యూజిక్ అనే ట్యాగ్ లైన్ ను ఇవ్వడం జరిగింది. సంగీత దర్శకులకు ఎంతో మందికి ఎన్నో రకాల బిరుదులు ట్యాగ్స్ ఉన్నాయి. మెలోడీ బ్రహ్మా అని ఒకరు.. మ్యాస్ట్రో అని మరొకరు ఉండగా ఇప్పటి వరకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నిలిచాడు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కు సామ్రాట్ ఆఫ్ మ్యూజిక్ అనే ట్యాగ్ వచ్చింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను ఇక పై సామ్రాట్ ఆఫ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అనే పిలవబోతున్నారు. అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఈ కొత్త ట్యాగ్ ను వినియోగించబోతున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను పుష్ప సినిమా తో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చేశారు. అదే పుష్ప సినిమా సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాస్త సామ్రాట్ ఆఫ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గా మారిపోయాడు. ఈ కొత్త పేర్లు వారికి ఎంతగా కలిసి వస్తాయి. అసలు ఈ కొత్త పేర్లు పుష్ప కే పరిమితమా ముందు ముందు కూడా కొనసాగేనా అనేది చూడాలి అల్లు అర్జున్ మాస్ లుక్ కు తగ్గట్లుగా దేవిశ్రీ ఇచ్చిన పుష్ప మాస్ ట్యూన్స్ తో పుష్ప సినిమా అద్బుతమైన మాస్ ఎంటర్ టైనర్ గా నిలవడం ఖాయం అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పుష్పలో బన్నీ లుక్ మరీ మాస్ ఎక్కువ అయ్యిందని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం బన్నీ దేనికి అయినా సెట్ అవుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే బన్నీ ఐకానిక్ స్టార్ అయ్యాడు.. ఇక దేవిశ్రీ చాల విభిన్నమైన మాస్ సాంగ్ ఇవ్వడం వల్ల ఆయనకు సామ్రాట్ ఆఫ్ మ్యూజిక్ బిరుదును కట్టబెట్టారు.