Begin typing your search above and press return to search.

'బింబిసార‌' హిట్..ఆ మూవీపైనే అంద‌రి దృష్టి!

By:  Tupaki Desk   |   11 Aug 2022 1:30 AM GMT
బింబిసార‌ హిట్..ఆ మూవీపైనే అంద‌రి దృష్టి!
X
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత `బింబిసార‌`తో ఊహించ‌ని విధంగా బ్లాక్ బస్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. దాదాపు రెండు నెల‌లుగా స‌రైన హిట్ లేక వ‌రుస ఫ్లాపుల్లో వున్న ఇండ‌స్ట్రీకి `బింబిసార‌`తో స‌రికొత్త జోష్‌ని అందించారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌.

ఇండ‌స్ట్రీ క్రైసిస్ లో వున్న టైమ్ లో సాలీడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించ‌డంతో అన్ని వ‌ర్గాల నుంచి ఈ హీరోపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీ ద్వారా మ‌ల్లిడి వ‌శిష్ట అనే యంగ్ డైరెక్ట‌ర్ ప‌రిచ‌య‌మ‌య్యాడు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ మూవీ ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ వైడ్ గా టాక్ కి త‌గ్గ‌ట్టే రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ విజ‌య‌వంతంగా ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ త‌రువాత రానున్న క‌ల్యాణ్ రామ్ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇప్ప‌డు అంద‌రి దృష్టి ఆ మూవీపైనే వుంది. వివ‌రాల్లోకి వెళితే.. పీరియ‌డిక్ ఫిక్ష‌న్ `బింబిసార‌`త‌రువాత నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ న‌టిస్తున్న మ‌రో పీరియాడిక‌ల్ మూవీ `డెవిల్‌`. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అని ట్యాగ్ లైన్‌.

అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ మూవీకి న‌వీన్ మేడారం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. 1940 కాలం నాటి క‌థ‌గా ఈ మూవీని పీరియాడిక్ నేప‌థ్యంలో రూపొందిస్తున్నారు. ఇందులో అత్యంత క్రూరుడైన బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా హీరో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క‌నిపించ‌నున్నారు. గ‌తంలో విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.

ట్రైన్ నుంచి దిగుతూ బ్లాక్ క‌ల‌ర్ బ్లేజ‌ర్‌.. లోప‌ల వాస్ కోట్ పై చైన్ కి వేడాడుతున్న వాచ్‌.. చేతిలో పిస్ట‌ల్ .. గుబురు గ‌డ్డం.. తీక్ష‌ణంగా చూస్తున్న లుక్స్ .. సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాయి. `పుష్ప‌` స్టోరీ విష‌యంలో సుకుమార్ కు స‌హ‌క‌రించిన శ్రీ‌కాంత్ విస్సా ఈ మూవీకి క‌థ అందించారు. షూటింగ్ ద‌శ‌లో వున్న ఈ మూవీ `బింబిసార‌`ని మించి అశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డం ఖాయం అని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.