Begin typing your search above and press return to search.

'ఊ అంటావా' వివాదంపై స్పందించిన దేవిశ్రీ..!

By:  Tupaki Desk   |   8 Jan 2022 10:40 AM GMT
ఊ అంటావా వివాదంపై స్పందించిన దేవిశ్రీ..!
X
'పుష్ప: ది రైజ్' సినిమాలో 'ఊ అంటావా ఊఊ అంటావా' అనే ప్రత్యేక గీతం ఎంత హిట్ అయిందో తెలిసిందే. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్ లో మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్ తో వచ్చిన ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన అందాలతో కనువిందు చేసింది.

లేటెస్టుగా 'పుష్ప' పార్ట్-1 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబడింది. థియేటర్లలో సినిమాని చూడని వారందరూ ఇప్పుడు ఓటీటీలో వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ 'ఊ అంటావా..' వీడియో సాంగ్ ని కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. థియేటర్ లో చూపించని కొన్ని సమంత స్పెప్పులను ఇందులో జత చేశారు.

ఈ నేపథ్యంలో 'ఊ అంటావా' పాట క్లిప్పింగ్స్ ను నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. నిజానికి ఈ ఐటమ్ సాంగ్ విడుదలయినప్పుడు లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని.. సమంత వస్త్రధారణ - డ్యాన్స్ మీద నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇదే విషయం మీద దేవిశ్రీప్రసాద్ ను ప్రశ్నించగా.. కొందరు కారణం లేకుండా వివాదాలు సృష్టించడాన్ని అలవాటు చేసుకున్నారని అన్నారు.

అందుకే వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటానని.. ప్రేక్షకులకు ఈ పాట నచ్చకపోతే యూట్యూబ్‌ లో ఉన్న రికార్డులను బద్దలు కొట్టేది కాదని దేవిశ్రీ అభిప్రాయ పడ్డారు. ఇకపోతే ‘పుష్ప’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

తన దృష్టిలో ఐటమ్ సాంగ్స్ అన్నీ భక్తి గీతాలే అని డీఎస్పీ చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 'రింగ రింగా' 'ఊ అంటావా' వంటి స్పెషల్ సాంగ్స్ లో భక్తి సాహిత్యాన్ని చేర్చి ఆలపించడంపై అభ్యంతరం తెలిపారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంగీత దర్శకుడి మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దేవీశ్రీ వ్యాఖ్యలు హిందూవుల మనోభావాలను దెబ్బతీసాయని.. వెంటనే యావత్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేవిశ్రీ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పకుంటే.. తెలంగాణలోని హిందూ ప్రజలు చెప్పులతో స్వాగతం పలుకుతారని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరించారు.