Begin typing your search above and press return to search.
వెదురుపాకలో సత్యమూర్తి గారి విగ్రహం
By: Tupaki Desk | 21 Jan 2016 11:12 AM ISTప్రముఖ రచయిత, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తండ్రి జి.సత్యమూర్తి గారు ఇటీవల కాలం చేసిన సంగతి తెలిసిందే. హిందూ ధర్మం ప్రకారం సత్యమూర్తి గారి చితాభస్మాన్ని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో తనయులు దేవి శ్రీ ప్రసాద్, సాగర్ కలిపారు. అనంతరం అక్కడి పత్రికలవారితో దేవీ సంభాషిస్తూ "నాన్నగారికి స్వగ్రామమైన వెదురుపాక (తూర్పుగోదావరి జిల్లా) అంటే చాలా ఇష్టమని. ఆ ఇష్టంతోనే తల్లిదండ్రులు సూర్యనారాయణ - ఉదయభాస్కర పేర్లు కలిసేలా సూర్యోదయం పేరుతో ఓ పెద్ద ఇల్లు కట్టించారని" చెప్పుకొచ్చారు. మే 24న తండ్రి పుట్టినరోజు నాటికి వెదురపాకలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహ ఆవిష్కరణతోపాటు ఆరోజున పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పిన దేవీ తన తండ్రి అస్థికలను పవిత్ర నదులైన గంగ - కృష్ణలోనూ కలుపుతున్నట్టు తెలిపారు.
