Begin typing your search above and press return to search.

వెంకీ మామ‌తో దేవీకి చెడిందా?

By:  Tupaki Desk   |   30 July 2018 5:27 AM GMT
వెంకీ మామ‌తో దేవీకి చెడిందా?
X
విక్ట‌రీ వెంక‌టేష్‌- నాగ చైత‌న్య `మామ - అల్లుడు` బంధం గురించి తెలిసిందే. అందుకే స్టార్ రైట‌ర్ కోన‌ వెంక‌ట్ తెలివిగా ఆ ఇద్ద‌రి కోసం `వెంకీ మామ‌` స్క్రిప్టును రాశారు. త‌న స్నేహితుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో కోన‌ ఫిలిం కార్పొరేష‌న్ ప‌తాకంపై ఈ భారీ చిత్నాన్ని స్వ‌యంగా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ - పీపుల్ ఫిలింఫ్యాక్ట‌రీతో క‌లిసి కోన వెంక‌ట్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఆ క్ర‌మంలోనే ఈ చిత్రానికి రాక్‌ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తార‌ని ప్ర‌క‌టించారు.

అయితే ఈ సినిమా నుంచి దేవీశ్రీ ప్ర‌సాద్ త‌ప్పుకోవ‌డం ఫిలిం వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తావిచ్చింది. దేవీ స్థానంలో థ‌మ‌న్ పేరును ప‌రిశీలిస్తున్నారంటే అస‌లేం జ‌రిగింది? అన్న ముచ్చట సాగుతోంది. జై ల‌వ‌కుశ‌ - స‌ర్ధార్ గ‌బ్బ‌ర్‌ సింగ్‌ వంటి భారీ చిత్రాల్ని తెర‌కెక్కించిన బాబి ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నార‌ట‌. ఆగ‌స్టు 8 నుంచి హైదార‌బాద్‌ లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంత‌టి క్రేజీ ప్రాజెక్టు నుంచి దేవీశ్రీ స‌డెన్‌ గా త‌ప్పుకోవ‌డ‌మేంటో తేలాల్సి ఉందింకా. తొలిసారి వెంకీ- చైతూ కాంబినేష‌న్ కాబ‌ట్టి ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు.