Begin typing your search above and press return to search.

మహర్షికి కావాల్సింది అదే

By:  Tupaki Desk   |   22 April 2019 9:35 AM IST
మహర్షికి కావాల్సింది అదే
X
ఏడాది గ్యాప్ తర్వాత మహేష్ ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్న మహర్షి విడుదలకు కేవలం పద్దెనిమిది రోజుల సమయం మాత్రమే ఉంది. డేట్ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు కానీ ప్రిన్స్ రేంజ్ బజ్ దీనికి రావడం లేదే అన్న ఫీలింగ్ మాత్రం కలుగుతోంది. దానికున్న ఒకే ఒక్క కారణం ఆడియో. ఇప్పటిదాకా మూడు పాటలు వచ్చాయి. ఏదీ టాప్ చార్ట్ బస్టర్ అనే రేంజ్ లో వైరల్ కాలేకపోయింది.

దేవి శ్రీ ప్రసాద్ స్థాయిలో ట్యూన్స్ లేవన్న విమర్శా వచ్చింది. అయితే అభిమానులు మాత్రం తమ హీరోకు ఆల్బం మొత్తం హిట్ సాంగ్స్ ఉండాల్సిన అవసరం లేదని ఒకటి రెండు దుమ్ము రేపే పాటలు పడ్డా లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుందని నమ్మకంతో ఉన్నారు. గత ఏడాది ఇదే దేవి భరత్ అనే నేను చేశాడు. అదీ మహా గొప్ప ఆల్బం కాదు. కాని టైటిల్ సాంగ్ తో పాటు వచ్చాడయ్యో సామీ పాటలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచి చాలా రోజులు మ్యూజిక్ లవర్స్ చెవుల్లో మారుమ్రోగిపోయాయి

ఇప్పుడు మహర్షిలో సరిగ్గా అలాంటి పాటలే కావాలి. ఎలాగూ మూడు వచ్చేశాయి కాబట్టి బాలన్స్ ఉన్న ఆ రెండు కనక అంచనాలు అందుకోగలిగితే పైన చెప్పిన లోపం కవరైపోతుంది. మరి దేవి నిరాశ పరచని ట్యూన్ ఇచ్చాడా లేదా అనేదే సస్పెన్స్. ఎంత స్టార్ హీరో అయినా మ్యూజిక్ విషయంలో జాగ్రత్త అవసరం.

రంగస్థలం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాదించడంలో పాటల వాటాను తీసిపారేయలేం. కేవలం వాటి కోసమే రిపీట్ రన్ లో సినిమా చూసిన వాళ్ళున్నారు. సో మహర్షి నుంచి రావాల్సిన ఆ రెండు పాటలు ఎలా ఉంటాయన్న దాని గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డేట్ తరుముకోస్తోంది కాబట్టి అభిమానులు సైతం మహర్షికి గ్రాండ్ వెల్కం చెప్పేందుకు ప్లానింగ్ చేసుకుంటున్నారు